Movie News

‘డాక్టర్’ దూకుడు.. బాలీవుడ్ కన్నీళ్లు

వేరే భాషల చిత్రాలు తమ మార్కెట్‌ను కొల్లగొట్టేస్తుండటం.. అదే సమయంలో హిందీ చిత్రాలకు సరైన ఆదరణ లేకపోవడం బాలీవుడ్‌లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది ఈ మధ్య. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు హిందీ మార్కెట్‌ను ఎలా కొల్లగొట్టాయో.. డైరెక్ట్ హిందీ సినిమాలు వాటి ధాటికి తట్టుకోలేక ఎలా చతికిలపడ్డాయో అందరూ చూశారు. దక్షిణాది చిత్రాల దాడి ఇలా ఉంటే.. అవి చాలదన్నట్లు ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయింది.

అదే.. డాక్టర్ స్ట్రేంజ్. మామూలుగా చూస్తే ఎవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంఛైజీలతో పోలిస్తే ‘డాక్టర్ స్ట్రేంజ్’ అంత క్రేజున్న సినిమా కాదు. అందుకే ఈ సినిమా రిలీజ్ గురించి ముందు ఇండస్ట్రీ జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ రిలీజ్ ముంగిట ఈ సినిమా క్రేజ్ ఇండియాలో మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూసి ట్రేడ్ పండిట్లు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.

‘డాక్టర్ స్ట్రేంజ్’కు ఇండియాలో కొన్ని సిటీల్లో తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేస్తున్నారంటే, వాటికి టికెట్లు పెట్టినవి పెట్టినట్లే అయిపోతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్లన్నింటికీ తొలి వీకెండ్‌కు దాదాగాపు టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. కేవలం ఐమాక్స్ స్క్రీన్ల నుంచే అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ.5 కోట్లు రాబట్టేసిందట ‘డాక్టర్ స్ట్రేంజ్’. ఇక మొత్తంగా తొలి వీకెండ్‌కు ‘డాక్టర్ స్ట్రేంజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి.

ఈ వారానికి వివిధ భాషల్లో చాలా సినిమాలే రిలీజవుతున్నప్పటికీ.. వాటన్నింటి వీకెండ్ వసూళ్ల కంటే ‘డాక్టర్ స్ట్రేంజ్’ కలెక్షన్లు ఎక్కువ ఉండబోతున్నాయన్నది స్పష్టం. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూస్తుంటే తొలి రోజు ఇండియాలో ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా నెట్ వసూళ్లు సాధిస్తుందని అంచనా. ఓవైపు అజయ్ దేవగణ్ లాంటి పెద్ద స్టార్ నటించిన ‘రన్ వే 34’ తొలి రోజు ఇండియాలో కేవలం రూ.3 కోట్ల వసూళ్లు సాధిస్తే.. మరీ పాపులర్ కాని ఓ హాలీవుడ్ మూవీ అంతకు పదింతలు కలెక్షన్లు రాబడుతుంటే బాలీవుడ్ వాళ్లకు కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి?

This post was last modified on May 3, 2022 3:28 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago