ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు ఒకవైపు తీవ్ర కాక రేపుతున్నాయి. ఇదే సమయంలో మహిళా కమిషన్‌కు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మధ్య కూడా తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. నువ్వు ఒకటంటే.. నే నాలుగంటా! అంటూ.. టీడీపీ, మహిళా కమిషన్లు రెచ్చిపోతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దివ్యాంగురాలి అత్యాచార ఘటన , తదనంతర పరిణామాల నేపథ్యంలో కమిషన్‌కు టీడీపీకి మధ్య తీవ్ర యుద్ధం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. వర్సెస్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మల మధ్య చోటు చేసుకున్న వివాదం మరింత ముదురుతోంది. బుధవారం.. టీడీపీ అధినేత చంద్రబాబు ను ఉద్దేశించి.. చైర్ పర్సన్ పద్మ.. పది తప్పులు చేశారంటూ.. మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది తీవ్ర వివాదం అయింది. ఇక, తాజాగా.. దీనికి కౌంటర్‌గా.. బొండా ఉమా “నువ్వు .. నువ్వు..“ అని కనీస గౌరవం కూడా లేకుండా… పది తప్పులు చూపించారు.
ఇలా ఒక మహిళా కమిషన్ విషయంలో ఏకవచనంతో సంబోధించడం.. రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సర్వత్రా విస్మయం.. వ్యక్తమవుతోంది. ఇక, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా సంధించిన 10 ప్రశ్నలు ఇవే..
1. మహిళ కమిషన్ చైర్మన్‌గా ఉంటూ 3 రోజుల వరకూ ఎందుకు పరామర్శించడానికి రాలేదు?
2. నువ్వు పరామర్శించాటానికి వచ్చావా పబ్లిసిటీ కోసం వచ్చావా?
3. నువ్వు ఇచ్చిన నోటీసులు తాడేపల్లి స్క్రిప్ట్ అవునా.. కాదా?
4. నువ్వు పబ్లిసిటీ కోసం వచ్చింది నిజమే కదా?
5.10 మంది పట్టని రూమ్‌లో 100 మంది ఉన్నారని అనటం అబద్ధం కదా?
6. మానసిక వికలాంగురాలైన మహిళపై అత్యాచారం జరిగితే వైసీపీ ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా?
7. నీకు వైసీపీ ప్రయోజనాలు తప్పితే మహిళల సమస్యలు పట్టవా?
8. చంద్రబాబు పరామర్శకు రాక పోతే మీరు బాధితులను పట్టించుకొనేవారా?
9. మేము 10 తప్పులు చేశమన్నావ్.. ఎక్కడో నిరూపించు
10. ఇంకా 90 తప్పుడు కేసులు పెట్టుకో భయపడం
కొసమెరుపు: ఈ పరిణామాలు చూస్తుంటే.. ఏపీలో ఈ వివాదం.. ముదిరి.. గతంలో కేరళలో ఏర్పడిన పరిస్థితి ఏర్పడినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు. కేరళలో ఇలానే మహిళా కమిషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన.. ప్రతిపక్ష నేత బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ.. అక్కడి హైకోర్టు ఆదేశించడంతోపాటు 5 లక్షల రూపాయలను కమిషన్ ఖర్చులకు చెల్లించాలని సైతం పేర్కొంది.
This post was last modified on %s = human-readable time difference 7:31 am
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…