Political News

బాదుడే బాదుడు.. మ‌రింత తీవ్రం చేయండి: చంద్ర‌బాబు

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ దోపిడీ, పన్నులతో బాదుడు పాలనను ప్రజలకు చాటిచెప్పేలా మరింత  ప్రభావవంతంగా `బాదుడే బాదుడు` కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. సామాన్యుడు నుంచి మధ్యతరగతి ప్రజలు సైతం చితికిపోయేలా జగన్ బాదుడు ఉందని చంద్రబాబు అన్నారు. పన్నులు, అధిక ధరలు, కరెంట్, బస్సు చార్జీల మోత పై తెలుగు దేశం తలపెట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిందని ఆయన తెలిపారు.

గ్రామ కమిటీలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, పన్నుల భారం, చార్జీల మోతపై ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. జగన్ అసమర్థ పాలనలో పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులను ఎలా ధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలు చూసారని చంద్రబాబు అన్నారు. అస్తవ్యస్థ ఆర్థిక విధానాలపై ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు వెలిబుచ్చుతున్న ఆందళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం అని చంద్రబాబు అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి లో బాలుడి మృతదేహాన్ని తండ్రి ద్విచక్ర వాహనం పై తరలించిన పరిస్థితికి వ్యవస్థల విధ్వంసమే కారణం అని చంద్రబాబు అన్నారు.

బాదుడే బాదుడు నిరసనలతో పాటు… పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా చంద్ర‌బాబు రివ్యూ చేశారు. టెక్నాలజీ ద్వారా, అత్యంత సులభంగా మెంబర్ షిప్ పొందే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. భారీ ఎత్తున మెంబర్ షిప్ చెయ్యడం లో గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరి పనితీరును లెక్కిస్తామని.. పని చేసిన వారికి తగిన గౌరవం ఉంటుందని అన్నారు. మెంబర్ షిప్ తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల ప్రమాధ బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఎంతో కొంత సాయం అదించే సౌకర్యం కూడా ఉందని తెలిపారు.

దురదృష్టవ శాత్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పొయిన కార్యకర్తల కుటుంబాలను బీమా ద్వారా ఆదుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దాదాపు 100 కోట్ల రూపాయల సాయం అందించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కార్యకర్తలకు సంక్షేమం కోసం నారా లోకేష్ నేతృత్వంతో ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ క‌మిటీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి సంబందించిన రూట్ మ్యాప్‌ను రెడీ చేస్తుంద‌ని చెప్పారు. 

This post was last modified on April 27, 2022 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…

2 hours ago

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా…

3 hours ago

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…

4 hours ago

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…

6 hours ago

చరణ్ కి పోటీగా సోనూసూద్ – చిరంజీవి రియాక్షన్

గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…

6 hours ago