టీడీపీని కానీ జనసేనను కానీ తిట్టే ప్రయత్నం చేయాలంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి పేర్ని నాని. అదేవిధంగా ఆయన మాటలు కూడా చాలా వ్యంగ్యార్థాలతో కూడుకునే ఉంటాయి. పొత్తులపై అధినేత క్లారిటీ ఇవ్వకున్నా పేర్ని నాని మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలవబోమని చెప్పిన పేర్ని నాని, రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు తెగ ఆరాటపడుతున్నారు. చంద్రబాబును మరియు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు వ్యంగ్యంతో , చిరు పేరు చెప్పగానే ప్రసన్న వదనంతో మాట్లాడడం ఆయనకే చెల్లు. ఆ విధంగా ఆయన రాజకీయం ప్రత్యేకం. ఆయన కూడా ప్రత్యేకమే !
రాజకీయాల్లోకి వచ్చాక మెగాస్టార్ కన్నా మించిన నటులు ఉన్నారు. ఉండాలి కూడా ! రాజకీయాల్లోకి వచ్చాక రజనీకి మించిన పంచ్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది కనుక ఆ విధంగా కూడా చాలా మంది ఉన్నారు. ఉండాలి కూడా ! అదేవిధంగా రాజకీయం ఎలా ఉన్నా రాణించాలి అన్న తలంపుతో కేవలం తమ విధానాలకే కట్టుబడి పనిచేసిన వాళ్లు ఉన్నారు. వాళ్లు ఉండాలి కూడా ! సైద్ధాంతికంగా ఓ పార్టీ ఎలా ఉన్నా కూడా పర్సనల్ ఇమేజ్ ను పెంచుకునే క్రమంలో కొందరు పనిచేస్తారు. కొందరు పార్టీ నాయకులను కలుపుకుని, ప్రాంతాలకతీతంగా పనిచేస్తారు. కొందరు విశ్లేషకులుగా ఉంటూ పార్టీలకు అతీతంగా స్నేహాలు చేస్తారు.
కానీ కొందరే మరికొన్ని నమ్మకాలకు కట్టుబడి ఉంటారు. ఆ విధంగా జగన్ నమ్మకాన్ని నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి పేర్ని నాని. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు కూడా మాట్లాడున్నారు ఈ మాజీ మంత్రి. మాజీ మంత్రులంతా సైలెంట్ అయిపోయినా కూడా పేర్ని నాని మాత్రం తనదైన శైలిలో విపక్షాలకు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ఆ విధంగా ఆయన ప్రభు భక్తి చాటుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఏపీ మంత్రులెవ్వరూ కూడా ఈ రోజు ప్రజల కోసం కాకుండా కేవలం విపక్షాల కోసమే పనిచేస్తున్న విధంగా ఉన్నారు. వారికి జతగా పేర్నినాని ఉన్నారు. ఉంటారు కూడా ! గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎందుకనో జగన్ విషయంలో మాత్రం వీరవిధేయతకు తార్కాణంగా నిలుస్తుంటారు.
మెగాస్టార్ ను అదే పనిగా పొగిడి, పవన్ కల్యాణ్ ను తిడుతుంటారు. ఆ విధంగా విభిన్న రాజకీయం ఒకటి నడిపిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రులలో కొడాలి నాని ఆ రోజు మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడరు. అదేవిధంగా అవంతి కూడా మాట్లాడరు. కానీ పవన్ పేరెత్తితే చాలు పేర్నినాని నోటికి వచ్చిందంతా సెటైర్ల రూపంలో మార్చి ఆ మీటర్ కు అనుగుణంగా మాట్లాడుతుంటారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా ఎదిగి అనూహ్యంగానే పదవీచ్యితుడయిన పేర్ని నాని గతం కన్నా భిన్నంగా ఏమీ లేరు. ఇకపై ఉండరు కూడా ! తామంతా జగన్ బొమ్మతోనే గెలిచాం అన్న భావనతో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా మాట్లాడతారో ఈయన కూడా అంతే స్థాయిలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. మంత్రులు ఎవ్వరైనా సరే జగన్ కు విధేయులుగా ఉండడం బాగుంది కానీ మాజీ మంత్రులు కూడా అదే కోవలో ఉంటూ ఆ నాడు తమకు పదవి ఇచ్చినందుకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జగన్ రాజకీయ ప్రత్యర్థులను తిట్టి పోస్తూ ఉంటారు.
This post was last modified on April 26, 2022 8:46 pm
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…