ఆయనొక మీడియా సంస్థకు అధినేత.. ఇంకా చెప్పాలంటే ఆయనకు అంగీకారం ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈనాడు సపోర్ట్ కూడా కోరుకున్న నాయకుడు. వైఎస్సార్ తరువాత మళ్లీ అంతటి స్థాయిలో ఇన్నాళ్లకు ఈనాడు పేపర్ చూపిస్తూ, సంబంధిత ప్రధాన వార్తలు, శీర్షికలూ చదువుతూ ఓ సీఎం హోదాలో కోపం అయ్యారు జగన్. అదే ఇవాళ్టి టర్నింగ్ పాయింట్ .. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ కూడా !
నాలుగు మీడియా సంస్థలపై జగన్ ఇవాళ మళ్లీ కోపం అయ్యారు. ముఖ్యంగా లీడింగ్ పేపర్.. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఈనాడు పై అక్కసు వెళ్లగక్కారు. ప్రభుత్వ కార్యక్రమంలో మీడియాపై మరోసారి విరుచుకుపడ్డారు. దీంతో జగన్ వ్యాఖ్యలు అత్యంత
వివాదాస్పదం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వివాదం మాట ఎలా ఉన్నా వాస్తవాలు ఎవరికి వారు గుర్తించి ప్రభుత్వాన్ని నడిపే క్రమాన్ని దిద్దుకుంటే ఇంకా మేలు అన్నది సీనియర్ జర్నలిస్టుల మాట. ఇవేవీ కాకుండా కేవలం రాతను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, ఉద్దేశాలను పరిగణించకుండా రాస్తున్నదంతా అబద్ధమే అని ఓ ప్రభుత్వాధిపతి నిర్ణయించడం తప్పే అని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తీకరిస్తున్నారు.
తప్పో ఒప్పో ఏదో ఒకటి మీడియా రాస్తుంది. మీడియా రాయకపోతే మాకు ఎలా నిజాలు తెలుస్తాయి అని ఇటీవలే ధర్మాన ప్రసాదరావు అనే రెవెన్యూ మినిస్టర్ ఆసక్తిదాయక రీతిలో మాటలు వెలువరించారు. అవును! వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు కానీ అంతకుమునుపు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కానీ ఈనాడు తన వంతు బాధ్యతతోనే వార్తలు రాసింది. ఆ విధంగా తన వంతు కర్తవ్య నిర్వహణను పూర్తి చేసింది. ఇప్పుడు కూడా ఆర్థికంగా ఓ రాష్ట్రం బలోపేతం కావాలని కోరుకుంటుందే తప్ప తప్పుడు నిర్ణయాలు వద్దని చెబుతుందే తప్ప ! అంతకుమించి రాసిందేం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త అప్పులు ఇచ్చే స్థితిలో ఆర్బీఐ లేదు అన్నది వాస్తవం కాదా ? ఉన్న వాటికే నిధులు సర్దలేక పథకాల నిర్వహణ భారం అయిపోతున్న సందర్భాలే లేవా? వీటిపై అధికార పార్టీ పునరాలోచించుకోవాలి… అని హితవు చెబుతుంది టీడీపీ.
ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా మామ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సభలో ఆద్యంతం ఆయన మీడియాను టార్గెట్ చేశారు. రాక్షసులతో తాను యుద్ధం చేస్తున్నానని ఓ వర్గం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఆవిధంగా ఆయన కొత్త యుద్ధం కాదు కానీ పాత యుద్ధానికే కొంత కొనసాగింపు ఇచ్చారు. సంక్షేమ పథకాలను ఉద్దేశించి ఇటీవల ఈనాడులో వస్తున్న కథనాలు ఉటంకించారు. రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చి పాపులర్ మీడియా కథనాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధంగా ఆయన తనని తాను సమర్థించుకుని, తన నిర్ణయాలను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ వాటికి కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయని సభా ముఖంగా వివరించే ప్రయత్నం ఒకటి చేశారు.
This post was last modified on April 23, 2022 3:57 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…