Political News

విజయసాయిపై విరుచుకుపడ్డ బండ్ల గణేష్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భక్తుడే అయినా.. రాజకీయంగా అందరితోనూ సన్నిహితంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటాడు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాస్త హడావుడి చేసినప్పటికీ.. ఫలితాలు తిరగబడేసరికి ఏదో ఒక పార్టీతో జట్టు కడితే కష్టమని సైలెంటైపోయాడు. అప్పట్నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెగ పొగుడుతున్నాడు. తన అభిమాన కథానాయకుడి పార్టీ జనసేనకూ మద్దతు ఇస్తున్నాడు.

ఏపీలో అధికారంలో ఉన్న వైకాపాకు చెందిన నాయకుల్లో తనకు నచ్చిన వారిని మాత్రం సందర్భాన్ని బట్టి పొగుడుతుంటాడు. ఐతే ఇప్పుడు ఓ వైకాపా అగ్రనేతపై బండ్ల ఉన్నట్లుండి విరుచుకుపడిపోయాడు. ఆ నేత మరెవరో కాదు.. ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటిదాకా బండ్ల ట్విట్టర్ హ్యాండిల్లో ఎప్పుడూ చూడని తీవ్రమైన పదజాలంతో విజయసాయిపై ట్వీట్లు పడ్డాయి. కమ్మ కులం మీద అదే పనిగా దాడి చేయడాన్ని తప్పుబడుతూ విజయసాయిపై ట్వీట్ల వర్షం కురిపించాడు బండ్ల.

“మీకు కులం నచ్చకుంటే …కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి. చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి”

“అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు. నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు. కానీ కులాన్ని కాదు…నిన్ను జైల్ కు పంపింది… కమ్మ వారు కాదు”
“త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు. అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా”
“కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేము. విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నవు …ఇది ప్రపంచానికి తెలుసు”
“వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి”
“అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం”
“అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది”

ఇవీ విజయసాయిపై బండ్ల వేసిన ట్వీట్ల పరంపరలో కొన్ని. మరి ఉన్నట్లుండి విజయసాయిపై బండ్ల గణేష్ ఈ స్థాయిలో విరుచుకుపడటానికి ప్రత్యేక కారణం ఏంటో తెలియడం లేదు. కేవలం విజయసాయి కమ్మవారిని టార్గెట్ చేస్తున్నందుకే ఇలా రియాక్టయ్యాడా లేక వ్యక్తిగతంగా ఏమైనా విజయసాయి వల్ల బండ్ల ఇబ్బంది పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది.

This post was last modified on April 16, 2022 3:39 pm

Share

Recent Posts

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

11 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

1 hour ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

5 hours ago