ఏపీ సర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభాలను చవి చూస్తోంది. అయినా కూడా మొండి ధైర్యంతో వెళ్తోంది. ముఖ్యంగా నిధులు లేక కొన్ని చోట్ల కొన్ని పనులు నిలిపివేసింది. కొన్ని చోట్ల అత్యవసరం అనుకుని ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదోవ పట్టిస్తోంది. ఆ మధ్య ఉపాధి నిధులను ఇలానే పక్కదోవ పట్టించి అభాసుపాలైంది. అప్పట్లో కోర్టు జోక్యంతో నిధుల మళ్లింపు ఆగింది. ఆ తరువాత ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలోని నిధులు వాడుకుని తరువాత మళ్లీ కోర్టు జోక్యంతో వాటిని వెనక్కు మళ్లించి వెనువెంటనే తప్పు దిద్దుకుంది.
ఈ సారి అత్యవసర సమయాల్లో విపత్తుల వేళ ఖర్చు చేయాల్సిన నిధులు కరోనా బాధితులకు చెల్లించేందుకు సమాయత్తమై సుప్రీంలో నవ్వుల పాలైంది. ఓ పిటిషనర్ కారణంగా ఈ ఉదంతం వెలుగు చూసింది. వాస్తవానికి కరోనా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అటు కేంద్రానికీ ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికీ ఉంది. సంయుక్త భాగస్వామ్యంతో చేయాల్సిన సాయానికి కేంద్రం పెద్దగా ఇచ్చింది లేదు అని తేలిపోయింది.
ఇదే విషయం కోర్టులో కూడా ఒప్పుకుంది. పార్లమెంట్ లో కూడా ఒప్పుకుంది. తామే అప్పులతో నెట్టుకు వస్తున్నామని కనుక ఈ దశలో తమ సాయం పెద్దగా ఉండదని కూడా చెప్పి ఓ యాభై వేల రూపాయల వరకూ మాత్రమే సంబంధిత కుటుంబాలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
అంతేకాకుండా బాధిత కుటుంబాలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున పింఛను ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. ఇవి కూడా ఇంకా తేలనే లేదు. వీటిలో కూడా ఇంకా అమలు అన్నది అనుమానాలకు సంబంధించే ఉన్నాయి. కానీ ఆ దశలో కేంద్రం చేయకుండా ఉంటే రాష్ట్రాలయినా సరే మానవతను చాటుకోవాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయమే కాకుండా అర్హులయిన వారికి ఉపాధి మార్గాలు వీలున్నంత వరకూ చూపాలని కూడా చెప్పింది.ఇదే సమయంలో ఏపీ కూడా కోర్టుకు చిక్కింది. అప్పట్లో కరోనా బాధితులకు పరిహారం చెల్లించక కోర్టుకు చిక్కింది. దాంతో ఆఘమేఘాల మీద నివారణ చర్యలకు అధికారులు సమయాత్తం అయితే ఇప్పుడు అది కూడా మరో వివాదానికి తావివ్వడం విచారకరం.
ఇంకా చెప్పాలంటే…
కరోనా మరణాలకు సంబంధించి ఇప్పటికీ చాలా మందికి పరిహారం అందని దాఖలాలే ఉన్నాయి. కోర్టుల జోక్యంతో కొన్ని చోట్ల పరిష్కారం అయిన సందర్భాలు ఉంటే కొన్ని చోట్ల కాని సందర్భాలే అనేకం. అయినా కూడా అధికారుల తరఫున వారికి దక్కుతున్న న్యాయం కూడా అంతంత మాత్రమే అన్నది తేలిపోయింది. వాస్తవానికి మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన పాలక వర్గానికి చెందిన వారంతా పక్క చూపులు చూడడమే ఇందుకు కారణం అని నిర్థారణ అవుతోంది. ఈ దశలో బాధిత వర్గం తరఫున మరోసారి గొంతెత్తడం బాధ్యత.
ఇదే సమయంలో నిధులకు సంబంధించి కేటాయింపు కూడా ఓ బాధ్యత. కానీ ఏపీ సర్కారు సరైన రీతిలో నిధులు లేనందున తప్పిదాలు చేస్తోందని తెలుస్తోంది. నిబంధనలను తోసిరాజని వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి అత్యున్నత న్యాయ స్థానంలో చుక్కెదురు అయింది. నిధుల మళ్లింపు విషయమై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. విపత్తు నిర్వహణ నిధులు మళ్లించరాదని ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) ను మరో విషయమై వాడకూడదని కూడా చెప్పింది. దీంతో బాధితులకు పరిహారం ఇప్పుడెలా చెల్లించాలో తెలియని మకతిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలది.
This post was last modified on April 14, 2022 10:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…