యుద్ధం ఎలా ఉన్నా ఎప్పుడు ఆరంభం అయినా మనకు మాత్రం ఓ నిర్థిష్టం అయిన సమాచారం వచ్చేలోగానే ప్రమాద ఘంటికలు మోగిపోవడం ఖాయం. అసలు యుద్ధం ప్రత్యర్థితో అయితే బాగుంటుంది కానీ అంతఃకలహాల దృష్ట్యా అంతర్యుద్ధానికి తావిచ్చే పరిణామాల కారణంగా ఆంధ్రావనిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అంతా నేను అని రాయడం బాగుంది. అంతా నేనే అని చెప్పడంలోనే ఇప్పటి ఇబ్బంది దాగి ఉంది.
యుద్ధం లో భాగంగా టీడీపీ లబ్ధి పొందితే అప్పుడు జగన్ కు సొంత మనుషులే శత్రువులు అయి ఉంటారు. శత్రువులను ఇంట్లోనే ఉంచుకుని యుద్ధానికి సిద్ధం అయి, పొరుగు రాజ్యంపై దండెత్తేతుందుకు వెళ్తే జగన్ పరువు పోతుంది. అందుకే ముందుగా అసంతృప్త సెగలు చల్లార్చాలి. ఆ పాటి పని జగన్ చేయాలి కానీ సజ్జల చెప్పినా వినరు మరియు వినిపించుకోరు.
తనతోటి దళిత మంత్రులంతా క్యాబినెట్లో ఉన్నారు అని కానీ తనను మాత్రమే ఎందుకు తప్పించారని మేకతోటి సుచరిత (నిన్నటి వరకూ హోం మంత్రి) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ లేఖను తన ఇంటికి వచ్చిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణకు అందించారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నో అవమానాలు కేసులు ఎదుర్కొని ధీరుడిగా నిలబడ్డారు. రాజ్యంలో సైనికుడు కోరుకునేది రాజు దీవెన, అండ ఈ రెండే కదా! కానీ తనకు అవేవీ దక్కడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. అయినా తాను జగన్ వెంటే ఉంటానని గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యాక్రమాన్ని కొనసాగిస్తానని నిన్నటి వేళ చెప్పడం ఆయనలో ఉన్న నిబద్ధతకు సంకేతం.
ఇక మొదటి నుంచి జగన్ వెంటే ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కి కూడా పదవులు లేవు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి కూడా పదవి లేదు. పోనీ బూతుల పురాణం వినిపించినా విపక్షాలను దీటుగా ఎదుర్కొనే కొడాలి నాని కానీ పొగరు సమాధానాలు ఇచ్చే పేర్ని నాని కానీ లేరు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి కి కూడా నో ఛాన్స్ అనేశారు. అంటే ఆయన ఇకపై విప్ గానే కొనసాగుతారా లేదా అన్నది కూడా స్పష్టం కావడం లేదు. అంటే జగన్ తన తరఫున మాట్లాడేందుకు కొత్త సైనికులను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారా? లేదా కొడాలి నానికి కానీ పేర్ని నానికి కానీ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించి ఎప్పటిలానే విపక్షాన్ని ఎదుర్కోవాలని ఆదేశిస్తారా?
This post was last modified on April 11, 2022 12:42 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…