ఏపీ కొత్త కేబినెట్ తుది జాబితా ఇదే.. క‌స‌ర‌త్తు పూర్తి..

మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు పూర్తయింది. గత మూడు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. సీఎం జగన్తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌ కూర్పుపై సీఎం కసరత్తు ముగిసినట్లు చెప్పారు. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రివర్గం ఉంటుందన్నారు.

అయితే.. మంత్రి వ‌ర్గ జాబితాకు సంబంధించి.. తాజాగా.. తుది కూర్పు జాబితా మీడియాకు అందింది. దీని లో కీల‌క మంత్రుల కొన‌సాగింపుతోపాటు..కొత్త‌వారికి కూడా చోటు క‌ల్పించారు. సామాజిక, ప్రాంతాల సమీకర ణాల మేరకు మంత్రివర్గ కూర్పు. సామాజిక సమతుల్యత ఉండేలా మంత్రివర్గం ఉంది. సాయంత్రం 6 గంట‌ల‌కు సీల్డ్‌ కవర్‌ను గవర్నర్‌కు పంపుతారు. అయితే.. ఇంత‌లోనే కొంద‌రికి ఫోన్లు వ‌చ్చాయి.

సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ రావడంతో ధర్మాన ప్రసాదరావు విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్‌లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని కోరారు. రేపటి కార్యక్రమం షెడ్యూ ల్‌ను కొత్త మంత్రులకు జీఏడీ పంపనుంది. నెల్లూరులో కాకాని గోవర్ధన్‌రెడ్డి ఇంటి దగ్గర సంబరాలు చేసు కుంటున్నారు.

కొత్త మంత్రులు వీరే

విజయనగరం జిల్లా నుంచి బొత్స స‌త్యనారాయ‌ణ‌, రాజన్నదొర
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు
విశాఖ జిల్లా నుంచి భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్‌
తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, కొండేటి చిట్టి బాబు, వేణుగోపాల కృష్ణ
పశ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్‌
కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి
గుంటూరు జిల్లా నుంచి విడదల రజనీ, మేరుగ నాగార్జున
ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్‌
నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్దన్ రెడ్డి
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప జిల్లా నుంచి అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాసులు.
క‌ర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం
అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ