Political News

పేరుకే పీసీసీ.. అంతా అతని చేతిలోనే?

ఇన్ని రోజుల పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. విభేధాలు.. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌.. ఇలా అస్త‌వ్య‌స్తంగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్ఠానం తాజాగా దృష్టి సారించింది. తెలంగాణలోని కీల‌క నేత‌ల‌తో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు.. పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో పుంజుకునేందుకు కాంగ్రెస్‌కు మంచి అవ‌కాశాలున్నాయ‌ని భావించిన ఆయ‌న‌.. పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డం కోసం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని నాయ‌కులు సూచించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల దిశ‌గా పార్టీని సిద్ధం చేసే ప‌ని టీపీసీసీ చేతిలో లేద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త సునీల్‌కు ఆ బాధ్య‌త అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని..
తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను పొంద‌డంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫ‌ల‌మైంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో జ‌నాల ఓట్లు పొంద‌లేక‌పోయింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ఎక్కించ‌లేక‌పోయారు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే 2014, 2018 ఎన్నిక‌ల్లో దిగిన కాంగ్రెస్ బొక్క‌బోర్లా ప‌డింది.

చివ‌ర‌కు అధినేత్రి సోనియా గాంధీతో రాష్ట్రంలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మికి కాంగ్రెస్ స్థానిక నాయ‌క‌త్వ‌మే కార‌ణ‌మ‌ని హైక‌మాండ్ భావిస్తుంద‌ని తెలిసింది. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు గురించి స‌రైన స‌మాచారం ఇవ్వ‌కుండా క‌చ్చితంగా గెలుస్తామ‌ని త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని అధిష్ఠానం అనుకుంటోంది. అందుకే ఈ సారి స్థానిక నాయ‌క‌త్వానికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ బాధ్య‌త‌ను అప్ప‌గించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాటిపైనే ఆధారం..
తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు బ‌లం ఉంది. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల అండ ఉంది. పైగా ఇటు టీఆర్ఎస్‌పై, అటు బీజేపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ క‌ష్ట‌ప‌డితే అధికారంలోకి రావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. అందుకే ఈ సారి వ్యూహాత్మ‌కంగా వెళ్లాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప్ర‌శాంత్ కిషోర్ టీమ్‌లో మొన్నటివ‌ర‌కూ స‌భ్యుడిగా ఉన్న సునీల్‌ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకుంది. సునీల్ బృందం తెలంగాణ అంత‌టా ప‌ర్య‌టించి పార్టీ ప‌రిస్థితిపై నివేదిక అందించ‌నుంది. అలాగే అభ్య‌ర్థులు ఎంపికపైనా స‌ర్వేలు చేసి అధిష్టానానికి రిపోర్ట్ ఎప్ప‌టిక‌ప్పుడూ పంప‌నుంది. సునీల్ నివేదిక‌ల ఆధారంగానే ఈ సారి అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల తెలంగాణ నాయ‌కుల‌కు రాహుల్ గాంధీ ఈ విష‌య‌మే చెప్పారంటా. అభ్య‌ర్థుల ఎంపిక పీసీసీ చేతుల్లో ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశార‌ని తెలిసింది. ఇక పార్టీలోకి పెద్ద ఎత్తున చేరిక‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు రాహుల్ సూచించారు. 

This post was last modified on April 8, 2022 8:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

7 minutes ago

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

35 minutes ago

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

56 minutes ago

4వ దెయ్యంతో లారెన్స్ రిస్కు!

హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…

2 hours ago

వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల…

2 hours ago

ముందు రోజు ప్రీమియర్లు….జెండా ఊపిన బచ్చల మల్లి!

కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…

2 hours ago