ఎన్నికలకు.. చంద్రబాబు పొత్తులకు అవినాభావ సంబంధం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన సందర్భాలు చాల తక్కువ. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఆయన పొత్తులు పెట్టుకోవడం ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు జనసేన కూడా అందుకు సిద్ధమంటోంది. ఇక మరోవైపు బీజేపీని కూడా కలిపేసుకోవాలని బాబు తెగ ఆరాటపడుతున్నారు.
కానీ బీజేపీ నాయకత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. పైగా వాళ్లు టీడీపీతో బంధాన్ని వద్దనుకుంటున్నారు. కానీ బాబు, బీజేపీ కలిసిపోయే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది. అందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కారణంగా మారతారని అంటున్నారు.
గుజరాత్ ఎన్నికల కోసం..
దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఆయన ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. అందుకే వివిధ పార్టీలు ఆయన సేవల కోసం ఆరాటపడుతున్నాయి. మొన్నటివరకూ ఆయనతో దూరంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు గుజరాత్ ఎన్నికల కోసం పీకేను సంప్రదించిందనే టాక్ వచ్చింది. కాంగ్రెస్ కోసం పనిచేసేందుకు పీకే సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ గుజరాత్ ఎన్నికల పుణ్యమా అని బాబు, బీజేపీ జత కట్టేందుకు అడుగులు పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్కడి గెలిచినా.. ఓడినా
ఇప్పటికే తెలంగాణ కేసీఆర్ పీకే వ్యూహాలతోనే ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో జగన్ కోసం మరోసారి ఆయన రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ ఏడాది గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పని చేయబోతున్నారు. ఒకవేళ గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. అప్పుడే ఏపీలో ఆయన పనిచేసే వైసీపీని ఓడించేందుకు బీజేపీ.. బాబుతో జతకట్టే అవకాశం ఉంటుంది.
కేసీఆర్‌ను బీజేపీ పైకి ఉసిగొల్పుతున్న పీకే.. జగన్ విషయంలోనూ అదే చేస్తారనే అనుమానాలు బీజేపీ అధిష్ఠానానికి కలుగుతున్నాయి. అందుకే బీజేపీ చంద్రబాబుకు మద్దతు పలికే అవకాశాలున్నాయి. ఒకవేళ గుజరాత్‌లో బీజేపీనే మళ్లీ గెలిచినా.. వైసీపీకి వ్యతిరేకంగా బాబుతో కలిసి బీజేపీ పనిచేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి పీకే కారణంగా టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయనే ప్రచారం జోరందుకుంది.
This post was last modified on March 30, 2022 2:18 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…