ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా చక్రం తిప్పిన చాలా మంది నాయకులు.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల్లో కొత్త నీరు ఎంత అవసరమో.. పాత నీరు కూడా అంతే అవసరం. దీంతో ఇలాంటి వారు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు.. అనే విషయం ఆసక్తిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ నేతలు ఎంవీ మైసూరా రెడ్డి, కావూరి సాంబశివరావు, నన్నపనేని రాజకుమారి, కనుమూరి బాపిరాజు, గాదె వెంకట రెడ్డి.. ఇలా అనేక మంది ఉన్నారు. వీరంతా ఒకప్పుడు.. రాజకీయాల్లో చక్రాలు తిప్పిన వారే.
పైగా వీరిలో కొందరు.. ఇప్పుడున్న అనేక మంది నాయకులకు అంటే.. జేసీ సోదరులు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సమకాలికులు. దీంతో వీరంతా ఎక్కడున్నారు? అనేది ఆసక్తిగా మారింది. పోనీ.. రాజకీ యాలను పూర్తిగా వదిలేశారా? అంటే.. అది కూడా లేదు. అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వీరి వ్యూహాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నామని భావిస్తున్న వీరంతా కూడా.. ఏదో ఒక పార్టీకి.. తెరచాటుగా మద్దతు ఇస్తున్నారు.
వీరు కేవలం నాయకులుగానే కాకుండా.. వ్యూహాత్మక రాజకీయాలు చేయంలోనూ దిట్ట. ఆర్థికంగా.. ప్రత్యర్థి పార్టీకి మద్దతుగా కొందరిని కూడగడతారు. సో.. ఇవన్నీ.. చేసేందుకు వీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడం.. రాజకీయాల్లో వీరిని ప్రత్యేక నేతలుగా మార్చింది. ఎందుకంటే.. గత ఎన్నికలకు ముందు కూడా.. సోషల్ మీడియా వేదికగా.. కొందరు నాయకులు టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వారి వారి సామాజిక వర్గాలను కూడా ప్రభావితం చేయడం ఇక్కడ ఆలోచిం చాల్సిన విషయం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి ఇలాంటి నేతల గురించి ప్రస్తావన వస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న వైసీపీ వ్యతిరేక ప్రచారంలో ఇలాంటి నేతల ప్రస్తావనే వస్తోంది. సో, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని.. వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. వీరు.. ఎలాంటి నిర్ణయాలు.. తీసుకుంటారో.. ఎటు నుంచిరాజకీయాలు చేస్తారో..అనేది ఒక దిగులు.. అయితే.. మరొవైపు… వీరి అనుచర గణం కూడా భారీగా ఉండడం మరో కారణంగా కనిపిస్తోంది.
This post was last modified on March 28, 2022 8:49 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…