Political News

జ‌న‌సేన ప‌ట్టుబ‌డితే.. టీడీపీ డైలామా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని.. టీడీపీ భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా యి. 2019 ఎన్నిక‌ల ఫ‌లితంతో త‌ల‌బొప్పిక‌ట్టిన నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాల‌నే వ్యూహం అత్యంత కీల‌కంగా మారింది. అటువైపు.. జ‌న‌సేన కూడా వైసీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌కుండా .. చూడాల‌నే వ్యూహంతో ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికిప్పుడు.. చంద్ర‌బాబు కానీ, ప‌వ‌న్ కానీ.. ఈ విష‌యంలో ఎలాంటి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయి నా.. పొత్తుల దిశ‌గానే రెండు పార్టీలూ అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై మ‌రో రెండు మాసాల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. పొత్తుల‌కు సంబందించి టీడీపీలో ఒక వాద‌న తెర‌మీద‌కి వ‌చ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌కు బ‌లం ఎంత ఉంది? ఎక్క‌డ ఉంది? ఎలా ఉంది? అనే మూడు విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కేవ‌లం రెండు జిల్లాల్లోనే జ‌న‌సేన టాక్ ఎక్కువ‌గా వినిపిస్తోంది.

గ‌త ఏడాది జ‌రిగిన మునిసిప‌ల్‌, పంచాయతీ ఎన్నిక‌ల్లో తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో.. ఈ రెండు పార్టీల నాయ‌కులు అన‌ధికార పొత్తు పెట్టుకుని గెలుపు గుర్రం ఎక్కారు. అంతేకాదు.. ఈ జిల్లాల్లోనే.. జ‌న‌సేన కు బ‌లం, బ‌లగం కూడా ఉన్నాయి. ఇత‌ర జిల్లాల్లో బ‌లం అంతో ఇంతో ఉన్నా.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన సామ‌ర్థ్యం చూపించే స్థాయి ఈ రెండు జిల్లాల్లోనే ఉంద‌ని.. జ‌న‌సేన నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనేటీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఈ రెండు జిల్లాల‌ను త‌మ‌కు వ‌దిలేసి.. మిగిలిన రాష్ట్రం మొత్తం. టీడీపీ పోటీ చేసిన‌నా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

అంటే.. జ‌న‌సేన త‌న స‌త్తాను చాటేందుకు ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను ప్రామాణికంగా తీసుకుంటే.. ఈ రెండు జ‌ల్లాల్లోని మొత్తం 31 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాల‌ను(కాకినాడ‌, రాజ‌మండ్రి, ఏలూరు, న‌ర‌సాపురం) త‌మ‌కు వ‌దిలేయాల‌నే డిమాండ్ తెర‌మీదికి తెచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, మిగిలిన రాష్ట్రం మొత్తం టీడీపీ పోటీ చేస్తే.. తాము మ‌ద్ద‌తిస్తామ‌నే డిమాండ్‌ను తెర‌మీదికి తేవాల‌ని.. క్షేత్రస్థాయిలో జ‌న‌సేన నాయ‌కులు అంటున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే.. రేపు ఈ విష‌యంపైనే జ‌న‌సేన ప‌ట్టుబ‌డితే… టీడీపీ ఏం చేయాల‌నే విష‌యంపై త‌మ్ముళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on March 26, 2022 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

11 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

28 minutes ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

1 hour ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

1 hour ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

4 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

4 hours ago