బడ్జెట్, బడ్జెటేతర రుణాలు సంబంధిత వివరాలు అన్నవి ఏపీ సర్కారుకు గుదిబండలా మారాయి. పద్దులో చూపించకుండా లక్ష కోట్లకు పైగా నిధులు ఏ విధంగా ఖర్చయిపోయాయో అన్నది తమ ప్రధాన సందేహం అని కాగ్ అంటోంది. ఎన్నడూ లేని విధంగా బడ్జెటేతర రుణాల వివరాలను బడ్జెట్లో పొందుపరచకుండా మాట్లాడడం కూడా తగదని అంటోంది. అంటే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం అని, తీవ్ర ఆర్థిక భారం మోస్తున్న రాష్ట్రం కనీసం సంబంధిత లెక్కలు వివరంగా చెప్పాల్సి ఉంటుందని చెబుతోంది.
ఈ క్రమంలో చాలా వరకూ చాలా పనులకు నిధులే లేవు అని కూడా తేల్చింది. వివిధ కోర్టు భవనాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తేలిపోయింది. పోరంకి వద్ద బందర్ కాల్వపై వంతెన నిర్మాణానికి కూడా నిధులు కేటాయింపు లేదన్నది తేల్చింది. ఈ విధంగా ఎన్నో తప్పిదాలు గుర్తించింది. వీటిపై సర్కారు చెప్పే మాటలు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తిదాయకం.
వైసీపీ మాత్రం కాగ్ రిపోర్ట్ ను తనకు అనుగుణంగానే భాష్యం చెబుతుందని కానీ నిజాలను నిందలుగా చూపి, అబద్ధాలను నిజం చేయాలని చూడాలనుకుంటోందని టీడీపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రహదారులకు మరియు వంతెనలకు ఇస్తున్న నిధులేవీ లేవని కాగ్ పేర్కొంటుందని, వీటిపై తాము మాట్లాడితే బండ బూతులు వినాల్సి వస్తోందని టీడీపీ తో పాటు జనసేన కూడా గొంతు కలుపుతోంది.
ఈ దశలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నేతృత్వాన కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విధంగా కొన్ని నిజాలు నిగ్గు తేలాల్సిన సమయం కూడా రానే వచ్చింది. ఇందుకు జగన్ సర్కారు సుముఖంగా ఉందో లేదో అన్నది మాత్రం చెప్పలేం. సభ ఆమోదం లేకుండా లక్షా పది వేల కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చు చేశారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటలనే మళ్లీ కాగ్ వినిపించి సంచలనం అయింది.
అంటే ఈ లక్ష కోట్లు దేనికి వెచ్చించారని.. ఎందుకు ఇంత మొత్తంలో లెక్కలు లేని డబ్బులు ప్రభుత్వం పక్కదోవ పట్టించాల్సి వచ్చిందని విపక్ష సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. కోడ్ కు విరుద్ధంగా డబ్బులు ఖర్చు చేయడం అన్నది నియమాలకు వ్యతిరేకం అని, ఈ విధంగా వెచ్చించిన 48 వేల కోట్ల రూపాయలను చెల్లింపులకు వినియోగించుకున్నందుకు లెక్కలు చెప్పాల్సిందేనని అంటోంది. ప్రధాన మీడియా వివరం అనుసారం..గత ఏడాదిలో 103 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వినియోగించుకుంటేనే ప్రభుత్వం గట్టెక్కలేకపోయిందన్న వివరం ఒకటి కాగ్ వెల్లడించింది.
ముఖ్యంగా కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్రాలు బడ్జెటేతర రుణాల వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ సర్కారు ఆ వివరాలు పెద్దగా బయటకు వెల్లడించిన దాఖలాలు లేవు. 2021 మార్చి నెలాఖరకు 86 వేల కోట్లకు పైగా రుణాలను బడ్జెటేతర రుణంగా తీసుకుంది.అంతకుమునుపు 38 వేల కోట్ల రూపాయలకుపైగా రుణాలను తీసుకుంది. ఈ వివరాలను బడ్జెట్ లో ప్రస్తావించలేదని కాగ్ తప్పు పడుతోంది.
This post was last modified on March 26, 2022 12:19 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…