ఏపీలో జరుగుతున్న కల్తీసారా మరణాలు, జేబ్రాండ్స్ అమ్మకాలు వంటి అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు సభలు కూడా ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. జనసేన కీలక నేత … నాగబాబు స్పందించారు. సీఎం జగన్‌పై తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. నాటుసారా అమ్మకం దారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆయన నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సారా ఉత్పత్తి, వినియోగం తీవ్రస్థాయిలో ఉందని.. పేర్కొన్నారు. అంతేకాదు.. దీని వినియోగం ఎక్కువగా ఉందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయన్నారు.
నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించామని, బాధిత కుటుంబాలతో మాట్లాడామని అన్నారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందన్న నాగబాబు.. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నాటుసారా అమ్మకందారులను సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు ?. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉంది. సీఎం జగన్ వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉంది. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. నేను స్వయంగా జంగారెడ్డిగూడెం వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాను.. అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సెల్పీ వీడియోను విడుదల చేశారు.
This post was last modified on March 24, 2022 9:28 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…