Political News

చిక్కుల్లో బెంగాలీ అక్క.. రిలీఫ్ లో తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును పెగాస‌స్ వ్య‌వ‌హారంలో ఇరికించాలి అని భావిస్తున్న వైసీపీకి అనూహ్య ప‌రిణామాలే ఎదుర‌వుతున్నాయి. అదేవిధంగా స‌భ‌లో స‌భ్యుల మాట తీరుపై కూడా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తుండ‌డంతో ఇంకా విష‌యం తీవ్ర త‌రం అవుతూ వ‌స్తోంది.ఇదే ద‌శ‌లో తాము ఏ నిఘా సంబంధ వ్య‌వ‌హారాల‌ను ప్రొత్సహిస్తూ స్పైవేర్ ను కొనుగోలు చేయ‌లేద‌ని ప‌దే ప‌దే టీడీపీ చెబుతుండ‌డం, అదేవిధంగా స‌భా సంఘానికి ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఒక్క‌సారిగా ఈ విష‌యంలో ఓ విధంగా విజ‌యం తెలుగు దేశాన్ని వ‌రించింది అనే చెప్పాలి. దీంతో త‌గాదా ఎక్క‌డిదాకా పోతుందో అని వైసీపీ కూడా కాస్త వెన‌క్కు త‌గ్గి మాట్లాడుతోంది.

ఈ ద‌శ‌లో పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ద‌ద్ద‌రిల్లిపోతోంది. ఇప్ప‌టికే దీనిపై కొన్ని వివ‌రాలు అందించిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ  ని స‌భా సంఘం ఎదుట హాజ‌ర‌య్యేలా చేయ‌గ‌ల‌రా అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. పెగాస‌స్ స్పై వేర్ ను తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో కొనుగోలు చేశార‌ని దీదీ చెప్పిన మాట‌ల‌తో ఏపీ అసెంబ్లీ ఒక్క ఉదుటున ఊగిపోయింది. విప‌క్ష మ‌రియు స్వ‌ప‌క్ష స‌భ్యుల మ‌ధ్య ఆగ్ర‌హావేశాలు రాజుకున్నాయి.

ఈ త‌రుణంలో చంద్ర‌బాబు వ‌ర్గంకు జ‌గ‌న్ వ‌ర్గంకు మ‌ధ్య రేగిన వివాదం ఒక్క సారిగా పై స్థాయికి చేరిపోయింది. మొత్తానికి స్పీక‌ర్ కాస్త త‌గ్గి స‌భా సంఘం ఏర్పాటు చేశారు. ఇందుకు వైసీపీ మ‌రియు టీడీపీ వ‌ర్గాలు ఏక కాలంలో విన్న‌వించ‌డం కూడా దోహ‌దం అయింది. దీంతో త్వ‌ర‌లో స‌భా సంఘం ఏర్పాటై మొత్తం వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేయ‌నుంది.

ఇక ఈ సాఫ్ట్వేర్  ను ఎవ‌రికి ప‌డితే వారికి అమ్మ‌ర‌ని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి వారు కూడా అంటున్నారు. అదేవిధంగా ప్ర‌యివేటు వ్య‌క్తులు కొనుగోలు చేసేందుకు వీల్లేద‌ని కూడా చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో శాస‌న స‌భ మాత్రం ఇందుకు విరుద్ధంగా వాదులాట‌కు తావిస్తోంది. ఎవ‌రి వాద‌న ఎలా  ఉన్నా తాము ఆ స్పై వేర్ ను కొనుగోలు చేయ‌లేద‌ని ప‌దే ప‌దే టీడీపీ అంటోంది రేప‌టి వేళ ఇదే క‌నుక నిరూప‌ణ అయితే వైసీపీ ఏం సమాధానం చెప్ప‌నుందో కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఓ విధంగా జ‌గ‌న్ ఇరుక్కుపోయారు అనే చెప్పాలి. స‌భా సంఘం నియ‌మించి ఆయ‌న తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఇరుక్కుపోయారు.

This post was last modified on March 24, 2022 8:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

37 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

3 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

4 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

4 hours ago