Political News

కాంగ్రెస్‌.. ఇక మూసేసుకోవ‌డ‌మే

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బిక్క‌చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం.. విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తున్న స‌మ‌యంలో కీల‌క నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు.. కీల‌క రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌లు ఆ పార్టీ ఉసురు తీసేస్తున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఆయుధాల‌ను అందిస్తున్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కాంగ్రెస్‌ను ప‌ట్టాలెక్కించే కార్య‌క్ర‌మానికి పార్టీ అధిష్టానం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతోంది. అయితే.. పా ర్టీ జాతీయ నేత‌లు.. మాత్రం .. కాంగ్రెస్‌పైనే తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ పార్టీ నేత‌లు రోడ్డున ప‌డుతున్నారు.

ప్రజలను కులం, మతం వంటి పలు అంశాల ఆధారంగా విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని, అందులో కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్తాన్, ఉగ్రవాదులే కారణమని నొక్కిచెప్పారు. వివిధ అంశాల ఆధారంగా ప్రజలను కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లోయలో పండిట్లపై జరిగిన ఘటనలకు పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని పేర్కొన్నారు.

జమ్మూలో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు ఆజాద్. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. కులం, మతం సహా ఇతర అంశాల ఆధారంగా 24×7 ప్రజలను విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయన్నారు. “నా సొంత పార్టీతో (కాంగ్రెస్) పాటు ఏ పార్టీని విస్మరించటం లేదు.“ అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా ఏ పార్టీని క్షమించనన‌ని అన్నారు. పౌర సమాజం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలన్నారు. కులం, మతం చూడకుండా అందరికి సమానంగా న్యాయం అందాల‌న్నారు.

“మహాత్మాగాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది. జమ్ముకశ్మీర్లో 1990లో జరిగిన దానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణం. దాని ద్వారా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కశ్మీర్ పండిట్ వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి“ అన్న ఆజాద్‌.. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ప ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో .. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీకి ఆయ‌న స్వ‌యంగా అస్త్రాలు అందించార‌ని .. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో వైపు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని మూసేయ‌డ‌మే మెరుగా! అనే చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 21, 2022 7:57 am

Share

Recent Posts

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

24 minutes ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

58 minutes ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

1 hour ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

1 hour ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

2 hours ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

3 hours ago