దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు కనీసం సమర్థవంతమైన అడుగులు కూడా వేయడం లేదు. కేంద్రంలో వరుసగా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు చేతుల్లో ఉన్న రాష్ట్రాలనూ చేజార్చుకుంటోంది. కానీ పార్టీ అధిష్ఠానం వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.
కాంగ్రెస్‌లో గత ఏడేళ్లుగా ఒకే తంతు నడుస్తోంది. వివిధ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం.. వెంటనే తాము రాజీనామా చేస్తామంటూ గాంధీ కుటుంబ నేతలు ముందుకు రావడం పరిపాటిగా మారింది. ఆ రాజీనామాలు చేయవద్దంటూ వాళ్లను మిగిలిన నేతలు వారించడం.. గాంధీ కుటుంబ నాయకులకు మద్దతుగా అన్ని రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేసి పంపడం.. ఇది పార్టీలో ప్రహసనంగా మారింది.
పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఏమో అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ పెత్తనం మాత్రం తన చేతిలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఇక రాష్ట్రాల పీసీసీలేమో గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ తీర్మానాలు చేసి ఢిల్లీ పంపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీఎల్పీ కూడా ఇదే తీర్మానం చేసింది.
ఇలా కొన్నేళ్లుగా కాంగ్రెస్‌లో ఒకే కథ నడుస్తోంది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కూడా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి సోనియా, రాహుల్, ప్రియాంక.. పార్టీ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ వాళ్లను మిగతా నేతలు వారించారని చెబుతున్నారు. ఇప్పుడేమో రాహుల్ ఎలా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రశ్న వస్తోంది. 2019లో ఓటమికి బాధ్యుడిగా రాజీనామా చేసిన ఆయన.. ఇప్పుడు ఏం సాధించారని తిరిగి ఆ పదవి చేపడతారంటూ సీనియర్లు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. ఇలా ముగింపు లేని కథగా సాగుతున్న కాంగ్రెస్ ఎపిసోడ్కు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో? ఆ పార్టీ ఎప్పుడు బాగు పడుతుందో? తెలియడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on March 17, 2022 5:50 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…