మరికొద్ది సేపట్లో రాష్ట్ర క్యాబినెట్ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ మధ్యాహ్నం వైఎస్సార్సీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది.ఈ భేటీలో కొత్త వారు ఎవరు క్యాబినెట్లోకి వస్తారు. పాత వారు ఎవరు కొనసాగుతారు అన్నది తేలిపోనుంది. అంతా ఊహించిన విధంగా ఓ నాలుగురైదుగురు మినహా పాత వారంతా ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎప్పటి నుంచో శ్రీకాకుళం సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ను గౌరవించుకోవాలని యోచిస్తున్న జగన్ ఈ సారి ఆయనకు క్యాబినెట్ లో బెర్త్ కన్ఫం చేశారు అని ప్రాథమిక సమాచారం. ఆయన అన్నయ్య కృష్ణదాసు అలియాస్ దాసన్నకు మాత్రం పదవీ వియోగం తప్పదు..అని తెలుస్తోంది. ఆ విధంగా అన్నయ్యకు పదవీ వియోగం తమ్ముడికి పదవీ యోగం ఏక కాలంలో దక్కనున్నాయి అని ఓ విశ్వసనీయ వర్గాల మాట.
ఒకవేళ ధర్మాన అభిమానుల కల నెరవేరితే..
ఇవి జరగొచ్చు.. ఆ విధంగా ఆల్ హ్యాపీస్…
ధర్మాన ప్రసాదరావు సీనియర్ పొలిటీషియన్ గా పేరున్న వ్యక్తే కాదు శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఏం చర్యలు చేపట్టాలో తెలిసిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రాలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసి కీలక రెవెన్యూ శాఖ నిర్వహించి ఆ పదవికి వన్నె తెచ్చిన వైనం ఇవాళ్టికీ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ఇదే సమయంలో ధర్మాన ప్రసాదరావుకు శాసన సభా వ్యవహారాలపై మంచి పట్టుంది. సభలో అర్థవంతం అయిన చర్చలు జరగాలి అన్న కోరిక ఉంది. ఇవన్నీ ఇవాళ ఆయన స్థాయిని మరింత పెంచేందుకు ఉపకరిస్తాయి.
క్యాబినెట్ లో ఇన్ అండ్ ఔట్ చూద్దాం
*నగరి ఎమ్మెల్యే రోజా – నో ఛాన్స్
*పాలకొండ ఎమ్మెల్యే కళావతి – మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి
*కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ కు పదవి దక్కనుంది
*అలానే బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధకు ఛాన్స్ ఉంది
*పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథికి ఛాన్స్ ఉంది.
*విప్ గడికోట శ్రీకాంత్ కు , దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వీరిద్దరిలో ఎవరో ఒకరికి కీలక ఐటీ శాఖ అప్పగిస్తే అప్పగిస్తారు. ఎందుకంటే వీరి ఉన్నత విద్యా నేపథ్యమే ఓ కారణం.
*నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ ను మాత్రం తప్పిస్తారు
*వైఎస్ ఫ్రెండ్ నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డికి ఛాన్స్ ఉంది
*అదేవిధంగా బొత్సను కానీ పెద్దిరెడ్డిని కానీ తప్పించరు
ఆళ్ల నాని ని తప్పిస్తారు.కొడాలి నాని మరియు పేర్ని నాని క్యాబినెట్ లో ఉంటారు.
*ధర్మానకు కీలక ఆర్థిక శాఖ కానీ ఆర్ అండ్ బీ కానీ రెవెన్యూ కానీ ఇవ్వొచ్చు.
*బుగ్గనను కూడా కంటిన్యూ చేయొచ్చు.చెప్పలేం.
ఎందుకంటే ఆయనపై పెద్దగా ఆరోపణలు లేవు కనుక..