వంద సంవత్సరాలు దాటేసిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ మాత్రమే దిక్కన్నట్లుగా తయారైంది వ్యవహారం. పార్టీకి నాయకత్వం వహించేందుకు సువిశాల దేశంలో, శతాధిక పార్టీలో మరో సమర్ధుడైన నేత కనబడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ నాయకత్వమే కంటిన్యూ అవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు. అలాగే పార్టీ పగ్గాలను సోనియా తర్వాత రాహుల్ అందుకోవాలని కూడా సమావేశం తీర్మానించింది.
వచ్చే ఆగస్టు 20వ తేదీన పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కూడా సమావేశం తీర్మానించింది. సరే ఇలాంటి సమావేశాలు ఎప్పుడు జరిగినా సోనియానో లేకపోతే రాహుల్ అదీకాక పోతే ప్రియాంకకో పార్టీ పగ్గాలు అప్పగించాలని ఏకగ్రీవ తీర్మానాలు మామూలే. చూడబోతే గాంధీ ఫ్యామిలీ తప్ప పార్టీ అధ్యక్ష పగ్గాలు అనుకునేంత సీనున్న మరో నేత లేడన్న విషయం అర్ధమైపోతోంది. సోనియాకేమో తీవ్ర అనారోగ్యం. రాహుల్ నేమో జనాలు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నేతగా గుర్తించటం లేదు.
అయినా వీరిద్దరు తప్ప మరో నేత అధ్యక్ష పగ్గాలు అందుకునేందుకు లేదని సమావేశం తీర్మానించటమే పార్టీకి పట్టిన దరిద్రం. ఎలాగూ పార్టీ అత్యంత క్షీణ దశలో ఉంది కాబట్టి ముందు పార్టీలోని పనికిరాని సీనియర్లందరినీ పంపించేస్తే తర్వాతన్నా పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుందేమో. సీనియర్లను కాదని సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. రాహుల్ సొంత నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నా సీనియర్లు పడనివ్వటంలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపికలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.
తమ స్వార్ధంకోసం సీనియర్లు జూనియర్లు, కొత్త నాయకత్వాలను ఎదగనీయటం లేదు. అందుకనే పార్టీకి గట్టిగా పనిచేసే నాయకత్వం రాష్ట్రాల్లో ఎక్కడా కనబడటం లేదు. విచిత్రమేమిటంటే ఓట్లేయటానికి జనాలు సిద్ధంగా ఉన్నా వేయించుకునేందుకు పార్టీ రెడీగా లేకపోవటం. మొన్నటి ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో జరిగిందిదే. తమ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తే పగ్గాలు వేరేవాళ్ళకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని సోనియా, రాహుల్ చెప్పటం నేతలు అలాంటిదేమీ లేదని అనడం సంవత్సరాలుగా చూస్తున్నదే. కాబట్టి కాంగ్రెస్ కు గాంధీ కుటుంబం తప్ప వేరే దిక్కులేదని అర్థమైపోతోంది.
This post was last modified on March 14, 2022 3:06 pm
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…