సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తప్పుచేస్తున్నట్లే ఉంది. తాజా ఎన్నికల్లో అఖిలేష్ కర్నాల్ లో బీజేపీ అభ్యర్ధిపై గెలిచాడు. అలాగే రాంపూర్ అసెంబ్లీ నుండి అజంఖాన్ కూడా బీజేపీ అభ్యర్ధిపైనే గెలిచాడు. అయితే వీళ్ళద్దరు తమ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పటికే ఎంపీలు కాబట్టి. ఎస్పీ ఎలాగూ అధికారంలోకి రాలేదు కాబట్టి ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసేసి ఎంపీలుగానే కంటిన్యు అవుదామని అనుకుంటున్నారు.
ఇక్కడే అఖిలేష్ తప్పు చేస్తున్నారా అని అనిపిస్తోంది. అఖిలేష్ ఎంపీగా ఉన్నా ఎంఎల్ఏగా ఉన్నా పెద్ద తేడాఏమీలేదు. ఎందుకంటే ఎంపీగా ఉన్నా ప్రతిపక్షంలోనే ఉంటాడు, ఎంఎల్ఏగా ఉన్నా ప్రతిపక్షంలోనే కూర్చుంటాడు. అయితే ప్రతిపక్షంలో కూడా ఒక తేడావుంది. అదేమిటంటే ఎంపీగా ఉంటే పార్లమెంటులోని అనేక ప్రతిపక్షాల్లో అఖిలేష్ కూడా ఒకడంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో క్యాబినెట్ ర్యాంకన్నా వస్తుంది.
ఎంపీగా ఉండి ఇప్పటికిప్పుడు అఖిలేష్ సాధించేది కూడా ఏమీలేదు. ఎంతకాలమున్నా ఎంపీగానే ఉండాలంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే రేపటి లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయచ్చు. ఆపని ఇపుడు కూడా చేయచ్చు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా ఉండదు. పైగా ముఖ్యమంత్రిగా ఉంటేనే అఖిలేష్ రాష్ట్రంలో ఉంటారని లేకపోతే ఎంపీగా ఢిల్లీకి వెళిపోతారని జనాలు తప్పుపట్టే అవకాశముంది.
ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేస్తే మళ్ళీ ఉపఎన్నికలు తప్పవు. అప్పుడు కర్నాల్, రాంపూర్లో ఎస్పీ అభ్యర్ధులు గెలిచేది కూడా అనుమానమే. అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్ధులే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చేజేతులా రెండు అసెంబ్లీ స్ధానాలను పొగొట్టుకున్నట్లవుతుంది. ఎంపీగా అఖిలేష్ రాజీనామా చేసినా పార్టీ అధ్యక్షుడి హోదాలో జాతీయ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశముంది. రెండేళ్ళలో టర్మ్ అయిపోయే ఎంపీగా కన్నా ఐదేళ్ళుండే ఎంఎల్ఏ పదవిలో అఖిలేష్ కంటిన్యు అయితేనే మంచిది. మరి ఏమి చేస్తాడో చూడాల్సిందే.
This post was last modified on March 13, 2022 12:41 pm
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…