Political News

తెలంగాణ అసెంబ్లీ…బీజేపీ ఎమ్మెల్యేేల అరెస్టు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు గందరగోళం, నినాదాల మధ్య ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభలోనే ఆర్ఆర్ఆర్ త్రయంపై వేటుపడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లపై స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా సమావేశాలను ప్రారంభించ‌డంపై ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కు లేదని విమర్శించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వారు అసెంబ్లీలో నినాదాలు చేశారు. దీంతో సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆ ముగ్గురు సభ్యుల‌ను సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొన‌సాగుతుంద‌ని స్పీకర్ వెల్లడించారు.

ప్ర‌శ్నించే గొంతులను అణ‌చివేయ‌లేర‌ని, అలా చేస్తే మరింత బలంగా ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని ఆ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. తమ మైకులు కట్ చేస్తున్నారని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఈటల విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గంటల తరబడి సభలో మాట్లాడారని, సీఎం అయ్యాక‌ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడతామ‌ని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ ముందు ఈటల, రాజా సింగ్, రఘునందన్ నిర‌స‌న‌కు దిగారు. కేసీఆర్ స‌ర్కారు తీరును నిర‌సిస్తూ నినాదాలు చేశఆరు. దీంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేసిన పోలీసులు వారిని బొల్లారం పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

This post was last modified on March 7, 2022 10:45 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago