Political News

అప్పటి వ‌రకు ఏపీకి రాజ‌ధాని హైద‌రాబాదే: మంత్రి బొత్స

ఏపీ రాజ‌ధాని అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ‘2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే’ అని బొత్స వ్యాఖ్యానించారు.

అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యకలపాలు సాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మరోవైపు మూడు రాజధానులు కట్టాలా..? వద్దా..? అని జగన్ సర్కార్ ఆలోచనలో పడింది. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధాన‌నుల‌పైనా బొత్స మాట్లాడారు.

మూడు రాజ‌ధానుల అంశంపై మాట్లాడుతూ..  `ఇప్పుడే కదా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31లోపు అన్ని విషయాలు తెలుస్తాయి. రాజధానులు కట్టకూడదని హైకోర్టు ఎక్కడ చెప్పింది? చట్టాలు చేయడానికి శాసనసభ, పార్లమెంట్‌లు ఉన్నాయి. ఇక్కడ చట్టాలు చేస్తే రాజ్యాంగ స్పూర్తికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అనేది నేను ఇదివరకే చెప్పాను. అలా కాదు.. శాసనసభ, పార్లమెంట్‌‌లు చట్టాలు చేయకూడదని కోర్టు చెప్పడమేంటి..? ఇవి చేయకూడదని న్యాయస్థానాలు చెబితే అసలు వ్యవస్థ ఎక్కడుంటుంది..?.“ అని ప్ర‌శ్నించారు.

“రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కదా ఏదైనా తప్పుబట్టొచ్చు.. ఎవరి పనులు వాళ్లు చేయాలి.. చేసుకోవాలి. కోర్టులపై మాకు నమ్మకం ఉంది.. చట్టాలు చేయడానికే శాసనసభ ఉన్నది.. ఆ అధికారం చేసే అధికారం శాసనసభకు అధికారం ఉంది’  అని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక‌, ‘టీడీపీకి విధి విధానాలు అనేవి లేవు. క్షణికావేశంలో టీడీపీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఉద్ధరించాలని, ప్రజల నుంచి సానుభూతి పొందాలని, రాజకీయ సానుభూతితో అసెంబ్లీకి వచ్చారు“ అని ప్ర‌తిపక్షం టీడీపీపైనా బొత్స విరుచుకుప‌డ్డారు.

“స్వార్థం కోసం తప్ప ప్రజా ప్రయోజనాలు, సమిష్టి నిర్ణయాలు, సమిష్టి అభిప్రాయాలు ఆ పార్టీకి లేవు. క్షణికావేశంలో తీసుకునే ఏ ఆలోచనలనూ ప్రజలు ఆమోదించరు. విశాలమైన ఆలోచనలు, దూర దృష్టితో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రజలు ఆమోదిస్తారు’ అని టీడీపీపై బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి బొత్స చేసిన రాజధాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, అమరావతి రైతుల సంఘాల నాయకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

This post was last modified on March 7, 2022 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

8 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago