Political News

వామ్మో.. పవన్ మీద మరీ ఇంత ఏడుపా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద ఏడుపు మామూలుగా లేదు. తాము.. తమ చేతిలో ఉన్న అధికారానికి మిగిలిన వారి మాదిరి కుక్కిన పేనులా ఉండిపోవాలే తప్పించి.. ఆత్మాభిమానంతో కూడిన పొగరుతో తల ఎగరవేయడం అస్సలు నచ్చట్లేదు. తోపుల్లాంటి వారి తోకనే కట్ చేసేశాం.. నువ్వెంత? అన్నది ఇప్పుడు వారి భావనలా మారింది. అందుకేనేమో.. భీమ్లా నాయక్ మూవీ విడుదల వేళ.. చేసిన చేష్టలు చాలవన్నట్లు.. సినిమా విడుదలై.. భారీ ఎత్తున కలెక్షన్లు సాధిస్తుంటే.. ఓర్చుకోలేనితనం కొట్టొచ్చినట్లుగా కనిపించేస్తోంది. అడ్డగోలు రాతలతో విషం కక్కేస్తున్న వైనం చూస్తే.. పవన్ మీద  మరీ ఇంత ఏడుపేందిరా బాబు? అనుకోకుండా ఉండలేం.

భీమ్లా నాయక్ మూవీని అణిచేశారంటూ శోకాలు పెట్టేస్తున్నారు.. మరి.. అణిచేస్తే ఇన్నేసి కోట్ల కలెక్షన్లు ఎలా వస్తాయి? అంటూ ధర్మ సందేహాన్ని వ్యక్తం చేస్తున్న వారు.. మర్చిపోతున్న పాయింట్ ఒకటుంది. ఒక సినిమా విడుదల వేళ.. మరే పని లేనట్లుగా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల్ని పెట్టి.. సాధించిన దాని గురించి కించిత్ ప్రస్తావించరు కానీ.. కలెక్షన్లు వస్తే.. మరీ ఇంత కలెక్షన్ రావటమా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న ఎర్రి ముఖాల్ని చూస్తే.. జనాభిమానాన్ని గుర్తించలేని వారి తీరుకు జాలి పడక మానదు.

నువ్వు ఎంత తొక్కితే.. స్ప్రింగ్ లా పైకి లేస్తా అన్నట్లుగా పవన్ మీద ‘పవర్’ ను ప్రయోగించి తొక్కేయాలనుకున్న ప్రతి సందర్భంలోనూ పవన్ మరింత శక్తివంతుడు అవుతున్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నారు. టీ.. కాఫీ రేట్ల కంటే తక్కువ ధరకు టికెట్ల ధరలు ఉన్నప్పుడు.. సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయన్న మాటను చూస్తే.. తాము ఎంతలా తొక్కేసినా.. కలెక్షన్లు రావటాన్ని జీర్ణించుకోలేని అజీర్ణతత్త్వం వారి మాటల్లో కనిపించక మానదు.

పవన్ సినిమా కలెక్షన్ల లెక్కల్ని ఈకకు ఈక.. పీకకు పీక అన్నట్లుగా విశ్లేషించే ఎర్రి ముఖాలకు.. సినిమా అన్నది వ్యాపారం. దాన్ని అలానే చూడాలన్న ఇంగితం కూడా మర్చిపోతున్నారు. ధార్మిక సేవ చేయాల్సిన టీటీడీ.. తన ధర్మం మరచిపోయి.. నోటికి వచ్చిన ధరలకు ఆర్జిత సేవల ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఈ నోళ్ల నుంచి మాట రాకుండా పడిపోవటం దేనికి నిదర్శనం?

సినిమా కమర్షియల్ వ్యవహారం. అలాంటి వాటికే తగ్గింపు ధరలు.. చౌకైన వినోదం ఉండాలంటూ నేల మీద పడి అదే పనిగా దొర్లుతూ.. శోకాలు పెట్టినోళ్లు.. దేవుడ్ని భక్తులకు దూరం చేసేలా సేవ టికెట్ల ధరల్ని పెంచేయటం చూస్తే.. సగటు జీవికి దేవుడ్ని తనకు తోచినట్లుగా పూజించే భాగ్యాన్ని ఎందుకు దక్కకుండా చేస్తున్నట్లు? సినిమా టికెట్లను రూ.5కు రూ.10కు చూపించాలని జీవోలు జారీ చేసే వారు.. దేవుడి దర్శనాలకు వేలాది రూపాయల ధరల్ని పెట్టటం ఎందుకు? తిరుమల కొండ మీద భోజనం ఫ్రీ అంటూ జనతా భోజనం కోసం గంటల తరబడి వెయిట్ చేసేలా చేస్తున్నారు సరే. మరి.. దేవుడికి ఫలానా సేవకు ఫలానా రేటు అని డిసైడ్ చేయకుండా.. ఆర్జిత సేవలు ఏవైనా సరే.. అన్నింటిని అందరూ చూడొచ్చు.. అనేలా రూల్ ఎందుకు తీసుకురారు?
భీమ్లానాయక్ కలెక్షన్ల మీద గొంతు చించుకునే పోటుగాళ్లు.. దేవుడికి చేసే పూజలకు భారీగా ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు నోరు విప్పరెందుకు? తమకున్న అభిమానంతో తమ అభిమాన నటుడి సినిమా చూస్తే.. దానికి వచ్చిన కోట్ల కలెక్షన్లకు హైరానా పడిపోవటం ఎందుకు? మరీ.. ఒక మనిషి మీద ఇంతలా విషం కక్కాలా? వికారం పెంచుకోవాలా? అంత అవసరమంటారా? 

This post was last modified on March 2, 2022 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago