చినబాబు కాన్ఫిడెన్స్ గా ఉన్నంత మాత్రాన
పార్టీ లో ఉన్న వారంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నారని అనుకోలేం
కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలే
ఇవాళ వైసీపీ కూడా చేస్తుండడం ఒక్కటే టీడీపీకి కలిసివచ్చే
విషయం అని రాజకీయ విశ్లేషకుల మాట! ఆంధ్రావనిలో వైసీపీని ఢీ కొనడం అంత సులువేం కాదు.అభివృద్ధి పనులు చేపట్టకపోయినా, సంబంధిత బిల్లులు పెండింగ్ లో ఉన్నా కూడా సంక్షేమం పై మాత్రం వైసీపీ సర్కారు ప్రేమ పెంచుకుంటుందే తప్ప తగ్గించుకోవడం లేదు.
తాజాగా జగనన్న తోడు పథకం కింద ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా చిరు వ్యాపారులకు సాయం అందించింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.ఇదే విధంగా ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం అందిస్తూనే ఉంది. జాతీయ బ్యాంకులు సహకరించకపోయినా కొన్ని ప్రయివేటు బ్యాంకుల సహకారం తీసుకుని మరీ! అప్పులు చేస్తోంది.ఆ విధంగా లబ్ధిదారులకు ఎంతో ఇంతో సాయం చేస్తోంది.
కొన్ని సార్లు తలకుమించి భారంగా పథకాలు మారిపోయినా కూడా వెనక్కు తగ్గడం లేదు.ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు బలోపేతం అవుతుందే తప్ప బలహీన పడడం లేదు.ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసన మండలి సభ్యులు లోకేశ్ అంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చినబాబు ఆత్మవిశ్వాసానికి తగిన విధంగా పార్టీ అయితే లేదు.ఒకరో,ఇద్దరో పోరాడుతున్నారే తప్ప మిగిలిన వారంతా స్తబ్ధుగానే ఉండిపోతున్నారు.పోనీ అంతర్గత విమర్శకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ బలోపేతానికి ఏమయినా చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు.
అయినప్పటికీ లోకేశ్..సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో బన్నీమాదిరిగా చల్ చలో చలో అని పాడుకుంటూ పార్టీని నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న ఎప్పటి నుంచో చినబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారన్న వార్తలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా లోకేశ్ పనిచేస్తున్నారు.లోకేశ్ కూడా గతంలో కన్నా కొంచెం పరిణితితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆ విధంగా వైసీపీ కి ఇప్పటికిప్పుడు బలమైన ప్రత్యర్థిగా లోకేశ్ పేరు స్థిరం కాకపోయినా, ప్రజా పోరాటాలు చేస్తూ, అదే సమయంలో న్యాయ పోరాటాలకు కూడా ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితాలు అయితే అందుకుంటారు.
This post was last modified on March 2, 2022 8:17 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…