ఆ ఇద్దరూ సమాన హోదా కలవారే. పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారే. ఆయా జాతీయ పార్టీలకు తెలంగాణ శాఖ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నవారే. ఒక రకంగా ఇద్దరూ సమఉజ్జీలే. కాకుంటే ఒకరు రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని ఎంతో అనుభవాన్ని సంపాదిస్తే.. మరొకరు వైకుంఠపాళిలో నిచ్చెన్లు ఎక్కుతూ పైకి వచ్చిన వారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ హోదా పరంగా సమానులే. ఒకరు మల్కాజిగిరి నుంచి.. మరొకరు కరీంనగర్ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. బండి సంజయ్ తో పోలిస్తే రేవంత్ చాలా సీనియర్. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా వరుసగా ఎదుగుతూ.. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ తన లక్ష్యం వైపు దూసుకెళుతున్నారు.
రేవంత్ తో పోలిస్తే బండి సంజయ్ రాజకీయంగా జూనియర్ అయినా.. తనను అదృష్టం వరించి ఏది పట్టుకుంటే అది బంగారంలా మారిపోతోంది. సంఘ్ కార్యకర్త నుంచి కార్పొరేటర్ గా పని చేసి ఏకంగా ఢిల్లీకి వెళ్లే అవకాశం దక్కించుకున్నారు. ఆపై స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే వచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక.., జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల వరకు నల్లేరుపై నడకలా సాగిపోతోంది బండి రాజకీయ ప్రస్థానం. ఇది ఎంత వరకు వెళుతుందో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా.. బండితో పోల్చుకుంటే ఎంతో సీనియర్ అయిన రేవంత్ ఆయనలా మాత్రం పనిచేయలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో బండి కంటే చాలా వెనకపడిపోతున్నారు. అందులో ఒకటి అసంతృప్తులను కట్టడి చేయలేకపోవడం. బీజేపీలో ఉన్న పాత తరం సీనియర్ నాయకులు తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఇటీవల అలకపాన్పు ఎక్కారు.
సీనియర్లు సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణా రెడ్డి, రాజేశ్వరరావు, ధర్మారావు, చింతా సాంబమూర్తి, నాగూరావు నామాజీ తదితర 20, 30 మంది నేతలు అసమ్మతి వర్గం పేరిట సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్యన కరీంనగర్లో ఒకటి.. ఇటీవల హైదరాబాద్‌లో మరొక సమావేశం పెట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన బండి వారికి మరో అవకాశం ఇవ్వలేదు. అసమ్మతి నేతలతో స్వయంగా భేటీ అయి వారికి సముచిత ప్రయారిటీ ఇస్తామని శాంతపరిచారు. దీంతో పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు.
అదే కాంగ్రెస్ లో అయితే ఇప్పటికీ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. రేవంత్ బాధ్యతలు చేపట్టింది మొదలు పలువురు సీనియర్లు ముఖం తిప్పుకున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్, వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, కేఎల్లార్ తదితర పాత కాపులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జగ్గారెడ్డి, వీహెచ్ అయితే రేవంత్ తీరును బహిరంగంగానే తూర్పారబడుతున్నారు. అసమ్మతులను చల్లార్చే విషయంలో బండిని చూసి రేవంత్ నేర్చుకోవాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. ఈ సమస్యను రేవంత్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.
This post was last modified on March 1, 2022 5:04 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…