తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజకీయ నాయకులైనా… అధికారులైనా టార్గెట్ చేయాలనుకోవడం ఆలస్యం విరుచుకుపడే రేవంత్ తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై మండిపడ్డారు. బీహార్‌లో ఎన్నికలు జరిగితే తుపాకులు, బాంబులు పట్టుకుని తిరుగుతారని వ్యాఖ్యానించిన రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి బీహార్ బ్యాచ్‌ను దింపారని కామెంట్ చేశారు.
బీహార్ బ్యాచ్ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్, రజత్ కుమార్, ఐపీఎస్ అంజనీ కుమార్ అంతా బీహార్ వాళ్లేనని, వాళ్లకు ఒక్కొక్కరికి ఐదారు శాఖలున్నాయని, కేసీఆర్ పూర్వికులు కూడా బీహార్ వాళ్లేనని వ్యాఖ్యానించారు.
బీహార్ ముఠా ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడిందని రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కేసీఆర్‌కు కనిపించడం లేదని ఆరోపించారు. పాలమూరు బిడ్డ ప్రవీణ్కుమార్, మరో ఐఏఎస్ ఆకునూరి మురళి కేసీఆర్ పాలన నచ్చకే రాజీనామా చేశారని, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా పీకే, ప్రకాష్రాజ్ వచ్చి తిరుగుతున్నారని, వంద మంది పీకేలు, ప్రకాష్రాజ్లు వచ్చినా ఏం పీకలేరంటూ రేవంత్ రెడ్డి కలకలం రేపే కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ భజన బ్యాచ్ పదేపదే నదులకు నడక నేర్పించాం, ఉచిత విద్యుత్, కేజీ టు పీజీ విద్య అని భజన చేస్తున్నారని, ఇంత చేస్తే ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు.
This post was last modified on March 1, 2022 10:51 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…