Political News

వైసీపీ స‌ర్కారు నిర్ణ‌యానికి హైకోర్టు బ్రేక్..ఏం జ‌రిగిందంటే

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఆర్భాటంగా తీసుకువ‌చ్చిన ఒక ఆర్డినెన్స్‌పై.. హైకోర్టు అనూహ్యంగా బ్రేకులు వేసిం ది. ఇంకో మాట‌లో చెప్పాలంటే.. ప్ర‌బుత్వ‌మే త‌న‌కు తానుగా వెన‌క్కి త‌గ్గింది. దీంతో ఇప్పుడు స‌ర్కారు ఎలాంటి న‌నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై ఆధిప‌త్యం పెరిగిపోయింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అయినప్ప‌టికీ.. స‌ర్కారుఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం తెలిసిందే.

ఈ క్ర‌మంలో వైసీపీ కీల‌క నాయ‌కుడు.. వైవీ సుబ్బారెడ్డిని రెండుసార్లు బోర్డు చైర్మ‌న్‌గా చేశారు. అదేస‌మ యంలో జంబో బోర్డును ఏర్పాటు చేశారు. దీనిలో వైసీపీ మ‌ద్ద‌తు దారులు, పెట్టుబ‌డిదారుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఇది చాల‌ద‌న్న‌ట్టుగా.. ప్ర‌త్యేక ఆహ్వానితులుఅనే కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు. దీనిలో ఏకంగా 51 మందిని చేర్చారు. వీరిలో పొరుగురాష్ట్రాల వారు కూడా ఉన్నారు. వీరికి జీతాలు లేకున్నా.. భ‌త్యాలు, స‌హాయకుల‌ను నియ‌మించారు. దీంతో టీటీడీపై భారీ ఎత్తున ఆర్థిక భారం ప‌డింది.

ఇక‌, ఈ ప్ర‌త్యేక ఆహ్వానితుల్లో చాలా మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బీజేపీకి చెందిన కీల‌క నేత‌,  మాజీ టీటీడీ బోర్డు స‌భ్యుడు  భాను ప్ర‌కాశ్‌రెడ్డి.. ప్ర‌త్యేక ఆహ్వానితుల అంశాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. దీనిపై స్టే ఇచ్చిన హైకోర్టు.. విచార‌ణ‌ల అనంత‌రం.. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి మాత్ర‌మే ప్ర‌త్యేక ఆహ్వానితుడుగా ఉండేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దీనిపై విచార‌ణ చేసే వ‌ర‌కు ఎవ‌రినీ ఆహ్వానించ‌రాద‌ని కూడా చెప్పింది.

అయితే.. ఇంత‌లోనే ప్ర‌భుత్వం దూకుడుగా వెళ్లింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల విష‌యంపై హైకోర్టులో కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మయంలోనే దీనికి సంబంధించి ఒక ఆర్ఢినెన్స్ తీసుకువ‌చ్చింది. దీనిపై మ‌రోసారి.. కోర్టులో సోమ‌వారం విచార‌ణ జ‌రిగిన సంద‌ర్భంగా.. న్యాయ వాది అశ్వినీ కుమార్ ఆర్డినెన్స్ విష‌యాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం… తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విచార‌ణ జ‌రుగుతుండ‌గా ఇదేం ప‌ని అని ప్ర‌శ్నించింది.

దీనిపై అస‌లు పూర్తిగా స్టే ఇస్తామ‌ని పేర్కొంది. దీంతో హ‌డ‌లి పోయిన‌.. అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఎస్‌. శ్రీరాం.. తాము ఆర్డినెన్స్ అయితే.. ఇచ్చాం కానీ.. కోర్టు తీర్పు త‌ర్వాతే.. దీనిపై అమ‌లు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. చెప్పేశారు. అంతేకాదు.. ఒక్క జభూమ‌న‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. దీంతో ఆర్భాటానికి పోయిన ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా చేసిన ఆర్డినెన్స్ బుట్ట‌దాఖ‌లైంది. 

This post was last modified on February 28, 2022 7:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

1 hour ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

2 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

2 hours ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

3 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

3 hours ago