Political News

తెలంగాణాలో జనసేన యాక్టివవుతోందా?

తెలంగాణాలో జనసేన మళ్ళీ యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తోందా ? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలనే పెంచుతున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో మాట్లాడుతు ప్రతి నియోజకవర్గంలోను క్రియాశీల కార్యకర్తలను తయారు చేసుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో కనీసం 100 మంది క్రియాశీల కార్యకర్తలను తయారుచేసుకోవటమే టార్గెట్ గా పెట్టుకోవాలన్నారు.

తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నేతలంతా పనిచేయాలని నాదెండ్ల చెప్పటంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికైతే తెలంగాణాలో జనసేన పార్టీ నామమాత్రంగా ఉంది. కేవలం మీడియా ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. పవన్ ఎప్పుడైనా సమావేశాలు పెడితే అప్పుడు మాత్రం కాస్త హడావుడి కనిపిస్తుంటుంది.

2014, 2019 లో జరిగిన ఎన్నికల్లోనే పవన్ తెలంగాణాను పూర్తిగా వదిలేశారు. దాంతో ఏపీలో ఏదో కాస్త ఉందని అనుకున్న పార్టీ యాక్టివిటీస్ తెలంగాణాలో దాదాపు శూన్యమైపోయాయి. అలాంటిది 2023లో షెడ్యూల్ ఎన్నికలు వస్తున్న సమయంలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ అనుకుంటున్నారంటేనే ఏదో తేడాగా ఉంది. తెలంగాణాలో టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయా అని అనిపిస్తోంది.

ఎందుకంటే ఏపీలో బీజేపీకి మిత్రపక్షమే అయినా తెలంగాణాలో మాత్రం అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పైగా ఒకవైపు కేసీయార్ ప్రభుత్వంపై బీజేపీ నానా రచ్చ చేస్తుంటే పవన్ మాత్రం కేటీయార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మొన్నటి భీమ్లానాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కేటీయార్ ను పవన్ ఆహ్వానించటమే నిదర్శనం. దీంతోనే పవన్ వ్యవహారశైలిపై బీజేపీ నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మెల్లిగా కేసీయార్ కు దగ్గరవుదామని పవన్ ప్రయత్నిస్తే రేపటికి అది పొత్తుగా మారే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఏపీలో కూడా బీజేపీతో కటీఫ్ తప్పదు  మరి చివరకు పవన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on February 28, 2022 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

2 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

2 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

3 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

4 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

4 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

5 hours ago