ఏపీ అధికార పార్టీ వైసీపీలో మహిళా ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్న మహిళలు.. పార్టీ కోసం.. ఎన్నో త్యాగాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, అనంతపురం.. ఇలా కొన్ని జిల్లాలను తీసుకుంటే.. ఆయా జిల్లాల్లో.. మహిళా వైసీపీ నాయకులు.. పార్టీ కోసం.. జగన్ కోసం.. ప్రాణం పెట్టారు. ఆస్తులు కూడా విక్రయించి.. పార్టీని నిలబెట్టారు. అయితే.. వీరిలో ఒకరిద్దరికి తప్ప.. పెద్దగా ఎవరికీ ప్రాధాన్యం లేదు. ఇలా కస్టపడిన ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రిపదవులు దక్కాయి. ఇంకా.. ఎంతో మంది మహిళా ఎమ్మెల్యేలు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే.. పార్టీతో ఆవిర్భావం నుంచి ఎలాంటి సంబంధాలు లేని.. కనీసం.. జగన్ పాదయాత్రలో పాదం కూడా కదపని.. ఎన్నిక లకు ముందు పార్టీ జెండా పుచ్చుకున్న ఓ మహిళా నేతకు మాత్రం పార్టీలో ఎనలేని గుర్తింపు లభిస్తోంది. అప్రకటిత మంత్రిగా ఆమె కొనసాగుతున్నారని.. పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. “అమ్మో.. ఆమె గురించి ఎందుకులే!“ అనే స్థాయికి ఆమె చేరిపోయిందట. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న హాట్ హాట్ చర్చ ఇదే! ఆ ఎమ్మెల్యే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న విడదల రజని. ఆమెకు, ఆమె కుటుంబానికి.. ఎనలేని ప్రాధాన్యం పెరిగిపోయిందని.. వైసీపీలో నేతలు తెగ గుసగుసలాడుతున్నారు.
ఇటీవల కాలంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు ఆమె ఇంటికి క్యూ కట్టడంపై వైసీపీ నేతలు బుగ్గలు నొక్కుకుంటున్నారు. తమకు ఏ పనులు కావాలన్నా.. ఆమె ఇంటికి వెళ్తున్నారట. ఈ పరిణామాలు.. ఆసక్తిగా మారాయి. ఏ కారణం లేకుండా.. అధికారులు ఈ రేంజ్‌లో.. ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే అవకాశం లేదని.. అంటున్నారు. దీనిని బట్టి.. ఆమెకు పార్టీలో ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని.. అంటున్నారు. అయితే.. ఇలా చేయడం వల్ల.. పార్టీలో ఎప్పటి నుంచొ ఉండి.. పార్టీ కోసం ఎంతో శ్రమించిన వారి కష్టాన్ని పక్కన పెట్టడమేనని.. ఇది అన్యాయమని కొన్ని గొంతులు వినిపిస్తున్నాయి.
అయినా.. ఎవరు మాత్రం లక్ష్య పెడతారు? అన్ని దారులు రజనీ ఇంటికే అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో అంటున్నారు సీనియర్లు. మరి త్వరలోనే ఆమెకు మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం, ఆర్థికంగా బలంగా ఉండడం.. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా విరుచుకుపడే తత్వం ఉండడం వంటివి ఆమెకు ప్లస్సులుగా మారాయని చెబుతున్నారు.
This post was last modified on February 28, 2022 9:14 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…