Political News

గోవిందా.. గోవిందా.. శ్రీవారి భక్తులకు మరో టోపీ

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఇటీవల కాలంలో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చౌక వినోదం పేరుతో సినిమా టికెట్ల ధరల్ని రోడ్డు మీద ఉండే టీ కొట్టులో అమ్మే కప్పు టీ కంటే తక్కువ ధరలను డిసైడ్ చేసిన ఏపీ సర్కారు.. అందుకు భిన్నంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. సేవల్లో పాల్గొనే విషయంలో వసూలు చేసే ఛార్జీలను మాత్రం భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. చౌక వినోదం గురించి గంటల కొద్దీ లెక్చర్లు ఇచ్చే అధికార వైసీపీ నేతలు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు చౌకగా ఎందుకు స్వామి వారి దర్శన భాగ్యాన్ని ఎందుకు కల్పించరన్న దానిపై మాత్రం నోరు విప్పని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కొనుగోలు చేసిన వారికి ఇచ్చే స్వామివారి ప్రసాదంలో కక్కుర్తి విస్మయానికి గురి చేస్తోంది. ఆర్జిత సేవల్లో కొన్ని సేవలకు భక్తులకు స్వామి వారి కండువాల్ని అందజేస్తుంటారు. ఇందుకోసం నాణ్యమైన పట్టు వస్త్రాన్ని అందచేయటం ఏళ్లకు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. అందుకు బదులుగా తాజాగా పట్టుకు బదులు పాలిస్టర్ కండువాలతో సరిపెట్టేస్తున్న టీటీడీ తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. నాణ్యత విషయంలో ఇలాంటి తీరు గతంలో మరెప్పుడూ లేదన్న మాట వినిపిస్తోంది.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. నాణ్యత విషయంలో భక్తులకు టోపీ పెట్టిన టీటీడీకి.. సరఫరాదారు చేస్తున్న మరో మోసం తాజాగా బయటకు వచ్చింది. ఇంతకాలం టీటీడీ తయారు చేసే స్వామి వారి ప్రసాదం కానీ.. ఇతర వస్తువులు కానీ నాణ్యతకు కేరాఫ్ అడ్రస్ మాదిరి ఉండేవి. అందుకు భిన్నంగా తాజా కండువా ఎపిసోడ్ చూసిన వారికి.. ఎలాంటి టీటీడీ.. ఎలా మారిందన్న మాట పలువురి భక్తుల నోటి నుంచి వస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.

ఆర్జిత సేవల టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇచ్చే కండువాకు సంబంధించిన షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అధికారిక పత్రాల్లోని సమాచారం ప్రకారం భక్తులకు ఇచ్చే ఒక్కో కండువాను రూ.90.65 చొప్పున వసూలు చేస్తున్నారని.. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.38కు మించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టులా ఉండే పాలిస్టర్ కండువాను భక్తులకు ఇవ్వటంపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ మాదిరి.. గతంలో పట్టు కండువాలో ఎరుపు.. ఆకుపచ్చ అంచుల్లో శంఖు చక్రాలతో పాటు.. నమో వెంకటేశాయ అనేఅక్షరాలు ఉండేవి. తాజాగా పంపిణీ చేస్తున్న కండువాల్లో టీటీడీ వ్యాక్యాలు ఉన్న జరి అంచును.. కండువాకు మిషన్ తో కుట్టిన వాటిని అందచేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త వివాదంగా మారింది. దీనిపై టీటీడీ ఏమంటుందో చూడాలి.

This post was last modified on February 27, 2022 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

20 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

4 hours ago