Political News

మోడీ మెడ‌కు 6000 కోట్ల గుజ‌రాత్ స్కాం?

మంచి అయినా… చెడు అయినా కావ‌చ్చు గుజరాత్ లోని ప‌రిణామాలు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి క‌నెక్ట్ అయిపోతాయ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్థానికంగా జ‌రిగే అభివృద్ధి ప‌నులు, రాజ‌కీయాలు, అవ‌క‌త‌వ‌క‌లు బీజేపీ ర‌థ‌సార‌థిని టార్గెట్ చేస్తుంటాయి. తాజాగా ఓ భారీ కుంభ‌కోణం విష‌యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. గుజరాత్‌లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్‌ తెలిపింది. ఈ కుంభ‌కోణం జ‌రిగిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి గా ఉన్న ప్ర‌స్తుత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సైతం ఈ మ‌కిలి అంటింద‌ని ఆరోపించారు.

కోల్‌ ఇండియా 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును  గుజరాత్‌లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమ దారుల పేరిట పంపించింది. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ర్టాల్లో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధిక ధరకు అమ్మేసుకున్నార‌ని త‌ద్వారా గుజ‌రాత్ రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గు లావేదేవీలతో బీజేపీ పెద్ద‌ల‌కు లింక్‌లు ఉన్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్ర‌భుత్వం ద్వారా స‌ర‌ఫ‌ర అయిన బొగ్గు ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్న ఈ భారీ కుంభ‌కోణంపై నిర్ణీత గడువుతో దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. బొగ్గు కుంభకోణం చోటుచేసుకున్న 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు (ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, విజయ్‌ రూపాణీ, భూపేంద్ర పటేల్‌) పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను తమవద్దే అట్టిపెట్టుకోవడం కాకతాళీయం కాకపోవచ్చని, ఇది అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్‌ ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మీడియాకు చెప్పారు.

కోల్‌ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు. బొగ్గు  లబ్ధిదారుల గురించి గుజరాత్‌ ప్రభుత్వం పంపిన వివరాలు నకిలీవని తేలిందని, ఉద్దేశించిన గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని అన్నారు. ఈ విష‌యంలో బీజేపీ పెద్ద‌లు స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

This post was last modified on February 26, 2022 8:13 am

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

36 seconds ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

5 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

58 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago