Political News

ప‌వ‌న్ హ‌వాను జ‌గ‌న్ నిలువ‌రించ‌గ‌ల‌రా?

సినిమా వేరు, రాజ‌కీయం వేరు అని అనుకున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ మ‌రియు ప‌వ‌న్ మ‌ధ్య యుద్ధం న‌డుస్తూనే ఉంది. కానీ సినిమా ప‌రంగా ప‌వ‌న్ ను ఇప్ప‌టికిప్పుడు ఢీ కొనేంత శ‌క్తి జ‌గ‌న్ కు లేదు గాక లేదు. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా జ‌గ‌న్ ను ఢీ కొన్నా ప‌వ‌న్ ఆశ‌లు అనుకున్నంత సులువుగా నెర‌వేర‌వు గాక నెర‌వేర‌వు. అయినా కూడా ఈ ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకు ఎక్కువ స‌మయం కేటాయిస్తున్నారు.

ఏపీలో టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి, త‌రువాత మెగాస్టార్ బృందం విజ్ఞ‌ప్తి మేర‌కు సవ‌రించిన‌ప్ప‌టికీ జీఓ అయితే ఇవ్వ‌లేదు.ఆ విధంగా ప‌వ‌న్ పై జ‌గ‌న్ పై చేయి సాధించారు. అయిన‌ప్ప‌టికీ సినిమా ఓపెనింగ్స్ కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ ఎంతో బాగున్నాయి.ఆ విధంగా చూసుకుంటే సినిమాల ప‌రంగా ప‌వ‌న్ ను జ‌గ‌న్ నిలువ‌రించ‌డం క‌ష్ట‌సాధ్యం అనితేలిపోయింది. ఇక రాజ‌కీయాల విష‌యానికే వస్తే ప‌వ‌న్ ఇంకా ఎదిగే క్ర‌మంలో ఉన్నారు.

పార్టీ ప్రారంభించాక రెండు సార్లు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు పోయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ పెద్ద‌గా నిల‌దొక్కుకోలేదు. 14 మార్చి 21014న ప్రారంభం అయిన జ‌న‌సేన పార్టీ అవ‌శేషాంధ్ర‌కు తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఆ రోజు టీడీపీతో పొత్తులో భాగంగానే ఉండిపోయారు. త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌తో వెళ్లిన‌ప్ప‌టికీ అనుకున్న ఫ‌లితాలు ఏవీ సాధించ‌లేకపోయారు.ఆ విధంగా ప‌వ‌న్ రెండు చోట్ల (భీమ‌వ‌రం,గాజువాక‌) పోటీ చేసినా కూడా ఫ‌లితం లేకుండా పోయింది.

అదే సంద‌ర్భంగా వైసీపీ రాజ‌కీయంగా బాగా నిల‌దొక్కుకుంది. విభ‌జిత ఆంధ్రాలో మొద‌టి సారి అర‌వైకి పైగా సీట్లు తెచ్చుకుని బ‌ల‌మైన విప‌క్షంగా నిలబ‌డింది. త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో 151 సీట్లు తెచ్చుకుని తిరుగులేని రాజ్యాధికారం ద‌క్కించుకుంది.ఈ ఎన్నిక‌ల్లో జన‌సేన జ‌గ‌న్ సేన‌ను నిలువ‌రించ‌లేక ఒక్క‌టంటే ఒక్క సీటుకే ప‌రిమితం అయింది.ఆ విధంగా రాజకీయంగా జ‌గ‌న్ ఎదిగి ప‌వ‌న్ ను నిలువ‌రిస్తున్నారు. సినిమాల పరంగా ప‌వ‌న్ ఎదిగి జ‌గన్ కు స‌వాల్ విసురుతున్నారు.

This post was last modified on February 25, 2022 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

25 minutes ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

36 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

1 hour ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

4 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago