సొంత పార్టీ ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని నేతలతో మాట్లాడుతూ ఆనం చెప్పారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ తర్వాత నామరూపాలు లేకుండా పోయిందట. తమ కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా చేయాలని నియోజకవర్గాన్ని విభజించిన ఒక నేతకూ అదే గతి పట్టిందట. జనం మాట వినకుండా జిల్లాల విభజన చేస్తే అధికారపార్టీకి కూడా అదే గతి పడుతుందని ఆనం చెప్పటం సంచలనంగా మారింది.
నిజానికి చాలాకాలంగా ప్రభుత్వంపైనే ఆనం బాగా మండిపోతున్నారు. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ళు మంత్రిగా ఉన్నపుడు ఆయన హవా నడిచింది. ఇపుడు జగన్ సర్కారులో ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రభుత్వంపైనే బహిరంగంగానో లేకపోతే మీడియా సమావేశాల్లోనో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వేలెత్తిచూపుతున్నారు.
జిల్లాల పునర్విభజన అంశానికి వస్తే ప్రజాప్రతినిధులను అడగకుండా జిల్లాల పునర్విభజన ఎలా చేస్తారంటు ఆనం ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్న సహేతుకమైందో కానీ ఆచరణలో జరగదు. ఏ ప్రభుత్వం కూడా ప్రతి పనిని ప్రజా ప్రతినిధులనో లేకపోతే జనాలందరినో అడిగి చేయదు. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా అనుకూలంగా వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పేవారు ఎప్పుడూ ఉంటారు.
మిగతా విషయాలు పక్కన పెడితే జిల్లా విభజన అనేది నేరుగా నాయకులను ప్రభావతం చేసేది కాబట్టి ఆ విషయంలో ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకపోవడం వల్ల వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆనం మాత్రమే కాదు జగన్ అంటే పడిచచ్చే ఎమ్మెల్యేలు కూడా జిల్లాల విభజన పట్ల ఉడికిపోతున్నారు.
వైసీపీసర్కారును బెదిరిస్తేనో లేకపోతే శాపనార్ధాలు పెడితేనో ప్రభుత్వం భయపడిపోతుందని అనుకుంటే ఆనం కన్నా అమాయకడు మరొకరుండారు. ఎందుకంటే జగన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన పట్టుదలకు పోతే ఓటమి ని కూడా పట్టించుకోరు. మరి అలా అని జగన్ ఎంత మందిని దూరం చేసుకుంటారో చూడాలి.
This post was last modified on February 17, 2022 4:19 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…