Political News

స‌వాంగ్ హ‌యాంలో నాలుగో సింహం.. న‌గుబాటు!

ఏపీ పోలీసు బాస్‌.. కేబినెట్ హోదా కూడా ఉన్న అత్యున్నత సాయుధ బ‌ల‌గాల అధికారి.. డీజీపీ గౌతం స‌వాంగ్ అత్యంత దారుణ‌మైన రీతిలో త‌న ప‌దవి నుంచి బ‌దిలీ అయ్యారు. అయితే.. గౌతం స‌వాంగ్ బ‌దిలీ వ్య‌వ‌హారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న డీజీపీగా వ్య‌వ‌హ‌రించిన కాలంలో కంటికి క‌నిపించ‌ని నాలుగో సింహంగా ఉన్న పోలీసులు.. తీవ్ర‌స్థాయిలో న‌గుబాటుకు గుర‌య్యార‌నేది వాస్త‌వం. ఎందుకంటే…. దీనికి రెండు ర‌కాల‌కార‌ణాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఒక‌టి రాజ‌కీయం.. రెండు.. అధికారికం. రాజ‌కీయంగా తీసుకుంటే.. స‌వాంగ్ పూర్తిగా వైసీపీ ప్ర‌భుత్వానికి లోబ‌డి పోయార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అరెస్టు చేయించ‌డంలోనూ.. అర్ధ‌రాత్రి అప‌రాత్రి లేకుండా.. ఇళ్ల‌కు వెళ్లి దాడులు చేయ‌డంలోనూ.. పోలీసులు అప‌కీర్తి మూట‌గ‌ట్టుకున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో న‌లుగురు లాయ‌ర్ల‌ను పోలీసులు అప‌హ‌రించి.. తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసిన హిస్ట‌రీ.. స‌వాంగ్ హ‌యాంలోనేచోటు చేసుకుంది. చివ‌ర‌కు.. హైకోర్టు జోక్యంతో వారిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఇక‌, విశాఖ డాక్ట‌ర్‌.. సుధాక‌ర్ విష‌యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు.. నాలుగో సింహంపై అన్ని వ‌ర్గాల నుంచి రాళ్లు రువ్వేలా చేసింది.

చివ‌ర‌కు హైకోర్టు మెట్లు నాలుగు సార్లు ఎక్కిన డీజీపీగా కూడా స‌వాంగ్ `కీర్తి` ద‌క్కించుకున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ.. పోలీసుల అతి జోక్యం.. డీజీపీ కార‌ణంగానే జ‌రిగింద‌నే విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చ లేక పోయారు. చివ‌ర‌కు అమ‌రావ‌తి ద‌ళిత రైతుల‌పై.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ఘ‌న‌త కూడా స‌వాంగ్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగింది. అయితే.. కొన్ని కొన్ని మంచి ప‌నులు ఉన్న‌ప్ప‌టికీ.. అంతిమంగా సిల్వర్ స్క్రీన్ పై..స‌వాంగ్ స్టోరీలో విల‌నిజ‌మే ఎక్కువ‌గా ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. చ‌ట్టాన్ని ప‌రిర‌క్షించాల్సిన డీజీపీ హోదాలో ఉండి.. చ‌ట్టాన్ని బొక్కేసే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. అన్ని స్థాయిల్లోనూ విమ‌ర్శ‌ల పాలైంది.

ఇంతా చేసిన స‌వాంగ్ సాధించింది ఏమైనా ఉందా?  అంటే.. చివ‌ర‌కు ఎలాంటి ప్రాధాన్యంకూడా లేకుండా పోయి.. ఆఖ‌రుకు పోస్టింగు కోసం.. ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఒక‌వేళ పోస్టింగు ఇవ్వ‌డంలో ఆల‌స్య‌మైతే.. జీతంలోనూ కోత‌ప‌డ‌డం ద్వారా.. ఆయ‌న సాధించింది ఏమిటో ఆయ‌నే తెలుసుకోవాల‌ని.. అంటున్నారు విశ్లేష‌కులు. 

This post was last modified on February 15, 2022 7:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

3 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

5 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

6 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

7 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

7 hours ago