ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. కేంద్రంలో ఏకచ్ఛాత్రాధిపత్యం ప్రదర్శించిన ఆ పార్టీ ఇప్పుడు తిరిగి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. కానీ సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పంజాబ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. త్వరలోనే పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదీ రాజకీయాల్లో ఆ పార్టీ పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పట్టేలా కాంగ్రెస్ అద్దె కట్టలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధికారిక నివాసంతో పాటు మరికొంత మంది నాయకులు ఉంటున్న భవనాల అద్దె చెల్లించలేదని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ కార్యాలయానికి సంబంధించి గత పదేళ్ల అద్దె రూ.12,69,902 బకాయి ఉంది. అక్బర్ రోడ్డులోని 26వ నంబర్ భవనంలో పార్టీ కార్యాలయం ఉంది.
2012 డిసెంబర్ తర్వాత ఆ భవనం అద్దె చెల్లించలేదు. ఆయా పార్టీలు సొంత భవనాలు నిర్మించుకునేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే 2010 జూన్‌లోనే కాంగ్రెస్‌కు భూ కేటాయింపు జరిగినా భవన నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా.. అనేక సార్లు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది.
మరోవైపు జన్‌పథ్ రోడ్‌లోని 10వ నెంబర్ ఇంట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉంటున్నారు. 2020 సెప్టెంబర్ నుంచి ఆ భవనం రెంట్ కూడా కట్టలేదు. ఆ అద్దె బాకీ రూ.4,610 ఉంది. చాణక్యపురిలోని ది-11/109 భవనంలో ఉండే సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ అద్దె బాకీ ఏకంగా రూ.5,07,911గా ఉందని కేంద్రం తెలిపింది. సుజిత్ పటేల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఈ వివరాలు వెల్లడించింది.
This post was last modified on February 11, 2022 2:10 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…