Political News

ప‌వ‌న్ ఆలోచ‌న బాగుంది కానీ..

2019 ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం సాగిస్తున్నారు. రెండేళ్ల విరామానికి తెర‌దించుతూ తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల్లో కూడా యాక్టివ్‌గానే ఉంటున్నాడు. రెంటికీ స‌మ ప్రాధాన్యం ఇస్తూ ఆయ‌న ప్ర‌యాణం సాగుతోంది. ఐతే రాజ‌కీయాల‌కు ఇంకా ఎక్కువ స‌మ‌యం కేటాయించి, పార్టీ నిర్మాణంపై ఎక్కువ దృష్టిసారించడం, అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవ‌డం, జ‌నాల్లో ఎక్కువ స‌మ‌యం గ‌డప‌డం అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ విష‌యంలో పవ‌న్‌కు ఫీడ్ బ్యాక్ అంద‌క‌పోతూ ఉండ‌దు. ఈ నేప‌థ్యంలోనూ ప‌వ‌న్ ఒక వినూత్న ఆలోచ‌న‌తో జ‌నాల ముందుకు వ‌చ్చాడు. అధికార పార్టీ త‌న మీద చేసే ముఖ్య‌మైన‌ విమ‌ర్శ‌ల విష‌యంలో వీడియో బైట్‌లు ఇవ్వాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నాడు. ఈమేర‌కు జ‌న‌సేన పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా తాజాగా రెండు వీడియోలు పోస్ట్ అయ్యాయి.

జ‌న‌సేనానిని తెలుగుదేశం పార్టీ ద‌త్త‌పుత్రుడు అని త‌ర‌చుగా వైకాపా నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌పై ఒక వీడియోలో ప‌వ‌న్ బ‌దులిచ్చాడు. తెలుగుదేశం పేరెత్త‌కుండా తాను ఏదో పార్టీకి ద‌త్తపుత్రుడిని కాద‌ని.. ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే దత్త‌పుత్రుడిన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు.  ఉద్యోగుల విష‌యంలో ప్ర‌భుత్వం తీరును త‌ప్పుబ‌ట్టిన ప‌వ‌న్.. వాళ్ల‌కు క‌డుపు మండి ల‌క్ష‌ల మంది బ‌య‌టికి వ‌చ్చి నిర‌స‌న వ్య‌క్తం చేస్తే దాని వెనుక‌ జ‌న‌సేనో, తెలుగుదేశమో లేదంటే భాజ‌పానో ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. ఇక ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం ఆధిప‌త్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న త‌న విమ‌ర్శ‌ల‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంపైనా ప‌వ‌న్ మ‌రో వీడియోలో స్పందించాడు.

స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చ‌రించిన ఉద్యోగుల‌పై ఎస్మా ప్ర‌యోగిస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలోనే తాను ఈ వ్యాఖ్య‌లు చేశాన‌ని, దీన్ని వ‌క్రీక‌రించొద్ద‌ని ప‌వ‌న్ స‌జ్జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు. ఐతే ఇలా వివ‌ర‌ణ‌లతో వీడియోలు రిలీజ్ చేయ‌డం బాగానే ఉంది కానీ.. అందులో ప‌వ‌న్ స్వ‌రం మ‌రీ మెత‌క‌గా ఉంది. ఏదో విన్న‌పాలు చేస్తున్న‌ట్లు, వివ‌ర‌ణ ఇస్తున్న‌ట్లు కాకుండా కొంచెం దూకుడుగా, కార్య‌క‌ర్త‌ల‌కు జోష్ వ‌చ్చేలా, ప్ర‌త్య‌ర్థి పార్టీ జ‌డుసుకునేలా ఆయ‌న మాట్లాడితే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని కార్య‌క‌ర్త‌లు, అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on February 10, 2022 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago