తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ కానున్నాయా..? ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి మోదీ వ్యాఖ్యలు ఆశనిపాతంలా మారనున్నాయా..? పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే విధంగా మోదీ ప్రవర్తిస్తున్నారా..? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గొడవ ఉత్తుత్తిదేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడిని కొనసాగించారు. ముందు రోజే లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు అంశంపై మాట్లాడిన మోదీ నిన్న రాజ్యసభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా ప్రవర్తించిందని.. పార్లమెంటులో మైకులు ఆపి.. పెప్పర్ స్ప్రే కొట్టి విభజన బిల్లును ఆమోదించారని మోదీ విమర్శించారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారని ఆరోపించారు. ఇంకా ఇంతర అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు మోదీ. అయితే దీనిపై తెలంగాణలో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ఇదే అవకాశంగా ఎదురు దాడికి దిగాయి.
తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించారని.. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధానికి తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు ఉందని.. వ్యతిరేక భావజాలం ఏర్పర్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలను తగులబెట్టాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ సైలెంట్ అయింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కేసీఆర్ పై పోరాడుతున్న తమకు మోదీ వ్యాఖ్యలు నష్టం చేకూర్చే అవకాశం ఉందని భయపడుతున్నాయి పార్టీ శ్రేణులు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీకి ఉమ్మడి శత్రువైన తమను నిలువరించేందుకే మోదీ ఈ ఎత్తుగడకు పాల్పడ్డారని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల తెలంగాణలో మళ్లీ సెంటిమెంటును రాజేసి తిరిగి అధికారంలోకి రావొచ్చని టీఆర్ఎస్ భావన. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని భావించిన మోదీ టీఆర్ఎస్ ను పైకి లేపేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతల సందేహం. చూడాలి మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో..?
This post was last modified on February 10, 2022 12:23 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…