Political News

స‌మ‌తామూర్తి విగ్ర‌హంపై కొత్త వివాదం రాజేసిన రాహుల్‌

ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేసిన సంగ‌తి తెలిసిందే. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆత్మ‌నిర్భ‌ర్ భారత్ గురించి కామెంట్లు చేశారు.

చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ కంపెనీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని తయారుచేసింది. ఈ పంచలోహ విగ్రహంలో 83శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను ఉపయోగించారు. 1600 విడిభాగాలుగా భారత్కు తీసుకొచ్చిన ఈ విగ్రహాన్ని 15 నెలల పాటు శ్రమించి అతికించారు.

ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చైనాలో తయారు చేశారు.. నవ భారత్ ఇండియా చైనాపై నిర్భరమేనా అంటూ ప్రధానికి చురకలంటించారు. ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో ఏర్పాటుచేసిన స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ జాతికి అంకితం చేయ‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లోనే రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి సైతం ద‌ర్శించ‌నున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్ స‌మ‌తామూర్తిని ద‌ర్శించుకున్నారు. ఇలా స్థానిక నేత‌లు మొదలుకొని దేశంలోని అత్యంత ప్ర‌ముఖుల ద‌ర్శ‌నీయ కేంద్రంగా నిలిచిన స‌మతామూర్తిపై రాహుల్ వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే హాట్ టాపిక్‌గా మారాయి.

This post was last modified on February 9, 2022 6:36 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

27 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago