ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఇప్పుడు అన్యాయం జరిగిందని అరుస్తుందని ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శలు కురిపించారు. పార్లమెంట్‌లో మోడీ ప్రసంగానికి కౌంటర్‌గా ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. “కాంగ్రెస్‌ను విమర్శించాలంటే మోడీ మొట్టమొదటిగా ఆంధ్రకు జరిగిన అన్యాయన్నే ఎత్తుకుంటారు. కానీ బీజేపీ కూడా చట్ట విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్‌కు మద్దతునిచ్చింది. మీ పార్టీకి చెందిన సుష్మాస్వరాజే చెప్పారు.. ఈ చిన్నమ్మ సహకరించింది కాబట్టే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పోయి ఇది చేశారు. అయినా మెజారిటీ వచ్చేది కాదు. కానీ ఎలాగోలా బిల్లు తీర్మానించారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చాక దీనిపై చర్చ పెట్టమని అడిగా. మోడీ చెప్పిన వ్యాఖ్యల మీదే చర్చ పెట్టమన్నా. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చా. ఢిల్లీలో సుజానా చౌదరీ ఇంట్లో అప్పుడు ఈ విషయంపై రెండున్నర గంటల పాటు చర్చించాం. కానీ టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టింది” అని ఉండవల్లి చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే..
జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనకు లేఖ రాశా. మీరైనా పార్లమెంట్‌లో చర్చ పెట్టండి అని కోరా. కానీ ఇప్పుడు దానికి సమాధానం కూడా రాలేదు. మోడీతో జగన్‌కు సత్సంబంధాలు అవసరం కాబట్టి పట్టించుకోలేదేమో అనుకున్నా. పవన్ మాత్రం ఒక్క ఎంపీ సీటు వచ్చినా ఈ విషయంపై చర్చకు పట్టుబడతామని చెప్పారు. విభజన కథ పుస్తకాన్ని ఆరేళ్ల క్రితమే తీసుకొచ్చాం. ఇప్పుడు అదే విషయాన్ని మోడీ చెప్పారు. మరి ఎందుకు వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఇదేమీ మోడీకి వ్యతిరేకం కాదు. ఆయన చెప్పిన వ్యాఖ్యలపైనా చర్చ పెట్టమంటున్నాం.
ఏ కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా అక్కడి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తేనే ఆ విషయాన్ని పరిశీలిస్తామని గతంలో పార్లమెంట్‌లో అడ్వాణీ చెప్పారు. ఆర్థిక అసమానతలు కానీ సాంఘిక అసమానతలు కానీ పోగొట్టడం రాష్ట్రం విడగొట్టడం ద్వారా సాధ్యం కాదు అందుకే తెలంగాణ ఏర్పాటుకు తాము అనుకూలం కాదని అడ్వాణీ స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత బీజేపీ స్టాండ్ మార్చింది. ఇప్పుడేమో అన్యాయం జరిగిందని చెబుతోంది. ప్రతి ఒక్కరూ అన్యాయం జరిగిందనే అంటున్నారు. కానీ ఆ అన్యాయం ఏమిటన్నది ఒక్క నోటీసు ఇచ్చి పార్లమెంట్లో చర్చ పెడితే తెలుస్తుంది. లోక్‌సభలోనే అన్యాయం జరిగింది. ఆ రోజు ఎంతమంది సభకు వచ్చారు.. ఎంతమంది ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా నిలిచారు.. ఎంతమంది వ్యతిరేకించారు అనేది నా దగ్గర సమాచారం ఉంది. బీజేపీ కలిసొస్తుంది కాబట్టి ఇంకెవరు అడుగుతారనే తెగింపుతో కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదించింది.
మేం తెలంగాణకు మద్దతిస్తున్నాం కాబట్టి ఏం అడగలేదని బీజేపీ ఎంపీలు అంటున్నారు. రాజధాని ఉన్న ప్రజలే రాష్ట్ర విభజన కావాలని కోరడం ఇంతకు ముందు జరగలేదు. అలాంటి విషయాన్ని ఎంత సున్నితంగా డీల్ చేయాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేశాయి. కానీ ఆ తర్వాత మన దురదృష్టం ఏమిటంటే.. టీడీపీ, వైసీపీ, జనసేన ఇప్పుడు బీజేపీకి సపోర్టే. వాళ్లు ఏం చెప్తే అదే చేస్తామంటున్నారు. కానీ చర్చకు మాత్రం ఎవరూ సిద్ధపడడం లేదు. ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ ఉమ్మడి ఆస్తుల పంపకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి ప్రశ్నిస్తే ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామని రాజ్యసభలో బీజేపీ ఎంపీ చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నవన్ని తెలంగాణకే సొంతం అంటున్నారు అని వెల్లడించారు. కానీ విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 45 గురించి ఎవరూ మాట్లాడలేదు.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రానికి అప్పగించడం మానేసి జగన్ ప్రభుత్వం ఎందుకు కడుతోంది? నిధులు ఇవ్వట్లేదని ఎందుకు అంటున్నారు? నీతి అయోగ్ నివేదికనేమో బయటపెట్టడం లేదు. అందులో ఏపీకి ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పినట్లు తెలిసింది. మనకు అన్యాయం జరిగిందని అన్యాయం చేసిన వాళ్లే అరుస్తున్నారు. కానీ మనకు భయం.. మరెందుకో భయం. పీక కోస్తూ కోస్తూ కొంచెం మందు ఇచ్చి దాన్ని లాగేసుకున్నారు. ఇప్పటికైనా టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి ప్రశ్నించాలి.
This post was last modified on February 9, 2022 5:26 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…