పీఆర్సీ సాధన సమితితో విభేదిస్తున్న ఉపాధ్యాయసంఘాలకు జనసేన మద్దతుగా నిలబడుతున్నదా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతబత్యాల వివాదాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటు మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం ఫిట్మెంట్ సాధించటంలో పీఆర్సీ సాధన సమితి నేతలు ఫెయిలైనట్లు పవన్ ప్రకటించారు.
సమస్య పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవటమే కాకుండా ఉద్యోగసంఘాలపై ఆధిపత్య ధోరణి అవలంభించిందంటు దుయ్యబట్టారు. ఏ ప్రభుత్వమైనా తనదే పైచేయి కావాలని ప్రయత్నిస్తుంది. సమస్య ఏదైనా ఉద్యోగ సంఘాలు చెప్పినట్లు నడుచుకోవటానికి ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. చర్చల్లో అయినా ఇతరత్రా మార్గాల్లో అయినా అంతిమంగా తనదే పైచేయిగా ఉండాలని ప్రభుత్వం అనుకోవటంలో తప్పేమీ లేదు. నిర్ణయాలు సరిగ్గా ఉన్నపుడు అది నడుస్తుంది గాని… అహంకారంతో నిర్ణయాలు చేసినపుడు కూడా తమదే నెగ్గాలని ప్రభుత్వం అనుకుంటే అది జరిగే పని కాదు.
చర్చలకు వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలను ఒత్తిడిలోకి నెట్టేసి ధన్యవాదాలు చెప్పేట్లుగా ప్రభుత్వం ఉద్యోగుల నేతలను కార్నర్ చేయటం ఏమిటంటు పవన్ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలతో విభేదిస్తున్న ఉపాధ్యాయ సంఘాల వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించటం గమనార్హం. ఈ నేపధ్యంలోనే జనసేన ఉపాధ్యాయసంఘాల డిమాండ్లకు మద్దతుగా నిలబడుతోందన్నట్లుగా చెప్పారు.
రెండు రోజుల క్రితం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు పిలిచినా ఆందోళనల్లో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉంటామని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జరుగుతున్నది చూస్తుంటే ఇపుడు ఉపాధ్యయుల సంఘాల ఆందోళనలకు డైరెక్టుగానే జనసేన మద్దతు ప్రకటించింది. బహుశా పవన్ ప్రకటన చూసిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు చేసే ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొంటారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయంలో పవనే క్లారిటీ ఇవ్వాలి.
This post was last modified on February 7, 2022 3:13 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…