బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది అలియా. ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ సినిమా కోసం అలియాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.
ఈ విషయంపై అలియా స్పందించింది కూడా. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ హింట్ ఇచ్చేసింది. ఇదిలా ఉండగా.. అలియాభట్ కు మరో తెలుగు స్టార్ తో కలిసి నటించాలనుందట. ఆ హీరో మరెవరో కాదు.. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలియా నటించిన ‘గంగూభాయ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది ఈ బ్యూటీ.
ఈ క్రమంలో తన ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పింది. అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుందని.. ఇది తన ఇష్టం మాత్రమే కాదని.. తన ఇంట్లో వాళ్లు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. ‘పుష్ప’ సినిమా చూసిన తరువాత అలియా ఇంట్లో వాళ్లంతా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారట. అలియాను ఇంట్లో ముద్దుగా ఆలు అని పిలుచుకుంటారట. ఇప్పుడు అల్లుతో ఆలు సినిమా ఎప్పుడు..? అని అడుగుతున్నారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటానని.. అతడు నా ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి బన్నీ యాక్షన్ కి బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు అలియాభట్ కూడా ఫిదా అయిపోయింది. ఆమె ఇలా పబ్లిక్ గా అల్లు అర్జున్ తో నటించాలనుందని చెప్పింది కాబట్టి ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువరోజులు పట్టకపోవచ్చు.
This post was last modified on February 4, 2022 2:46 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…