కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ(సీఆర్పీఎఫ్) భద్రత కల్పించింది. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలు ఒవైసీ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హాపుర్- గాజియాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్ప్లాజా వద్ద జరిగిన దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని అసదుద్దీన్ కోరారు. ఈ క్రమంలో ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిసింది.
నిందితులను సచిన్, శుభంగా గుర్తించారు. ఒవైసీ హిందూ- వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు.. తమ మనోభావాలను దెబ్బతీశాయని, అందుకే కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల వద్ద పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఒవైసీపై నిందితులు కాల్పులు జరిపిన దృశ్యాలు.. సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. “యూపీ మేరఠ్లోని కిథౌర్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ బయలుదేరాను. ఛాజర్సీ టోల్గేట్ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు.” అని అసదుద్దీన్ చెప్పారు.
This post was last modified on %s = human-readable time difference 6:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…