గుడివాడ క్యాసినో పై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. క్యాసినో నిర్వహించామని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ క్యాసినోకు 500 కోట్లు వచ్చాయంటున్న టీడీపీ నేతలు.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ఎద్దేవా చేశారు. క్యాసినో నిర్వహించామ ని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడలో తనను ఓడించలేకే.. లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలకు అన్ని తెలుసన్న నాని.. 3 రోజుల క్యాసినోకు 362 రోజులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలకు జీవిత కాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం అని స్పష్టం చేశారు.
పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.
అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరిం చాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి అని మంత్రి కొడాలి నాని అన్నారు.
This post was last modified on January 29, 2022 4:55 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…