దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది.
ఆ ప్రకారం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు కాగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ 563.47 కోట్లతో(26.46 శాతం) ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, ఆ వెనక 267.61 కోట్లతో అన్నాడీఎంకే ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో 1,639.51 కోట్లు (76.99 శాతం) ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. డిపాజిట్ల కేటగిరిలో జాతీయ పార్టీల్లో బీజేపీ రూ.3,253.00 కోట్లు, బీఎస్‌పీ రూ.618.86 కోట్లు ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎఫ్‌డీఆర్ డిపాజిట్ల పరంగా ఎస్‌పీకి రూ.434.219 కోట్లు ఉండగా, టీఆర్ఎస్ రూ.256.01 కోట్లు, డీఎంకే 162.425 కోట్లు, శివసేన రూ.148.46 కోట్లు, బీజేడీ రూ.119.425 కోట్లు ఉన్నట్టు ప్రకటించాయి.
ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు తమ రుణాలను రూ.134.93 కోట్లుగా చూపించాయి. జాతీయ పార్టీలు రూ.74.27 కోట్లు రుణాలు చూపించగా, కాంగ్రెస్ పార్టీ అప్పులు రూ.49.55 కోట్లు చూపించింది. ప్రాంతీయ పార్టీలు రూ.60.66 కోట్ల మేరకు రుణాలున్నట్టు ప్రకటించాయి.
This post was last modified on January 29, 2022 9:04 am
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…