ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. కొందరు ఈ జిల్లాల ఏర్పాటును స్వాగ తించారు. మరికొందరు ఏపీ ప్రబుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. స్వాగతించిన వారుకూడా.. కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వానికి మరింత ఖర్చు పెరుగుతుందని అంటున్నారు. ఇక, ప్రశ్నిస్తున్నవారు.. సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బాగానే ఉన్నా.. వీటివల్ల అయ్యే ఖర్చును తట్టుకునే పరిస్థితి రాష్ట్రానికి ఉందా? అనేది వీరి ప్రధాన ప్రశ్న.
ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు,, రోడ్ల గుంతలు పూడ్చేందుకు కూడా.. నిధులు లేవని.. చేతులు ఎత్తేస్తు న్న ప్రభుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటుతో అయ్యే ఖర్చుకు సొమ్ములు ఎక్కడ నుంచి తెస్తుందని అంటున్నారు. అంతేకాదు.. నెల నెలా జీతాలు ఇచ్చేందుకు సొమ్మసిల్లుతున్న పరిస్థితి వుందని.. సాక్షాత్తూ సలహాదారులే చెబుతున్న నేపథ్యంలో రేపు కొత్త జిల్లాలకు మౌలిక సదుపాయాలు.. ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ బంగళా, రెవెన్యే ఆఫీసులు ఎలా నిర్మిస్తారని అంటున్నారు.
పోనీ.. జిల్లా హెడ్ క్వార్టర్లు ప్రకటించారు కనుక.. అక్కడ ఏమైనా.. అభివృద్ధి ఉంటుందిలే… సో.. జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందిలే అనుకోవడానికి ప్రభుత్వం వైపునుంచి రోడ్లు, నీరు, విద్యుత్ వంటి పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే కదా.. ఇతరులు పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని.. కానీ.. ఇలా చేయకుండా.. కేవలం జిల్లాలను ప్రకటించి వదిలేస్తే.. ప్రయోజనం ఏంటి.. కేవలం చర్చ తప్ప అంటున్నారు.
మరోవైపు.. ఇంకొందరు.. తెలంగాణను ఉదాహరణగా పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన సమయానికి తెలంగాణ ఆర్థికంగా.. బలంగా ఉన్న రాష్ట్రమని.. కానీ.. ఎప్పుడైతే.. 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రకటించి.. అక్కడ మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సి వచ్చిందో.. ఆ తర్వాతే.. దాదాపు అప్పుల దిశగా తిరోగమనంలో ప్రయాణించిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారనే విషయాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన కూడా కేవలం ప్రచారానికి.. ప్రస్తుతం జరుగుతున్న వివాదాలను పక్కదారి పట్టించేందుకు మాత్రమేనని అంటున్నారు. మొత్తానికి ఏపీలో జిల్లాల ఏర్పాటు ఆసక్తిగా మారింది.
This post was last modified on January 26, 2022 7:00 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…