గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్లో క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానికి, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం నడుస్తోందని ఆరోపిస్తే…ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తారా అంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నానిపై, ఏపీ డీజీప సవాంగ్ పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఇంటి గేటు తాకినా కొడాలి నాని శవాన్ని పంపుతామని బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్లు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో కొడాలి నానిని జనం చంపుతారని, ఈ లోపే కొడాలి నాని దుబాయ్ పారిపోతాడని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా.. తేల్చుకుందాం అంటూ నానికి సవాల్ విసిరారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని, కొడాలి నానికి టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటని వెంకన్న అన్నారు.
హరికృష్ణను కొడాలి నాని మోసం చేశారని ఆరోపించారు. అంతేకాదు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోలీస్ అధికారిగా ఉన్నపుడు కొడాలి నానిని స్టేషన్ లో వేసి చితక్కొట్టారని వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలేమైనా నీ బావ ,బావమరిది అనుకున్నావా..? వాడు ,వీడు అంటున్నావు అంటూ వెంకన్న ధ్వజమెత్తారు. నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు.
డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీయని, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబును తిడుతుంటే డీజీపీ ఎందుకు మాట్లాడరని వెంకన్న నిలదీశారు. నానిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే డీజీపీ దేశంలో మరెక్కడా లేరని, ఈ డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదని బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. సవాంగ్ పదవీ కాలం మరో ఏడాదిలో ముగుస్తుందని, ఆ తర్వాత వదలబోమని, తనను అరెస్టు చేసినా, కేసులు పెట్టుకున్నా, చంపినా భయపడబోనని అన్నారు.
This post was last modified on January 24, 2022 8:22 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…