తన మాటలతో రాజకీయాలను వేడెక్కించే వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ సీఎం జగన్, వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డికి సంచలన సవాల్ రువ్వారు. కొన్నాళ్లుగా తనపై సాయిరెడ్డి చేస్తున్నవిమర్శలకు చెక్ పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా విజయసాయిరెడ్డి.. తనను పారిపోయారని.. సీఐడీ నోటీసులు ఇస్తే.. తప్పించుకున్నారని.. ఎంపీ పదవికి రాజీనామా విషయంలో దోబూచులు ఆడుతున్నారని విమర్శిస్తున్నట్టు రఘురామ తెలిపారు. అయితే.. తాను పారిపోలేదని.. తన ఎంపీ బాధ్యతల్లో భాగంగానే ఢిల్లీకి వచ్చానని.. సీఐడీ ఇచ్చిన నోటీసులపై కోర్టులో కేసు వేశానని అన్నారు.
ఈ క్రమంలోనే ఎంపీ సాయిరెడ్డికి, సీఎం జగన్‌కు రఘురామ సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఇద్దరు నేతలు.. ఒప్పుకొంటే.. తక్షణం తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తన సవాలుకు ఇద్దరు నేతలు స్పందించాలని అన్నారు. తాను తప్పించుకునే టైపు కాదని రఘురామ తెలిపారు. అంతేకాదు.. ఇప్పుడైనా తన సవాల్‌ను స్వీకరిస్తే.. వెంటనే తనపై వేటు వేయించాలని.. లేకపోతే.. వేయించలేనని ఒప్పుకోవాలని అన్నారు. ఇప్పుడు బంతి జగన్, సాయిరెడ్డి చేతుల్లోనే ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. ఇక, ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని వెల్లడించారు.
తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును ఏపీ సీఎం జగన్ నిలిపివేయించారన్నారు. గుడివాడ క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అన్నారు. పీఆర్సీ వివాదంపై సీఎం నిర్దేశం ప్రకారం మంత్రులు ప్రజల ముందుకెళ్తే… ప్రభుత్వానికి నష్టమన్నారు.
This post was last modified on January 22, 2022 10:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…