సోషల్ మీడియాలో చాలామంది కొడాలి నాని పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. బూతుల మంత్రి అని పిలుస్తుంటారు. ఇందులో టీడీపీ వాళ్లు మాత్రమే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో మీడియా ముందు బూతుల దండకం అందుకుంటూ ఉంటారు. ఎవరి రెకమండేషన్‌తో వచ్చింది అన్నది పక్కన పెడితే నానికి టీడీపీలో తొలిసారిగా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది చంద్రబాబు నాయుడే అన్నది వాస్తవం. కానీ ఆయన మీద ఎందుకంత పగో అర్థం కాదు కానీ.. బాబు పేరెత్తితే చాలు పేట్రేగిపోతుంటాడు నాని.
అలాగే ఆయన తనయుడు లోకేష్‌ను కూడా తిట్టని తిట్టు తిడుతుంటాడు. ఇప్పటికే ఈ విషయంలో హద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయిన నాని.. ఇప్పుడు మరింత కిందికి దిగిపోయారు. ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిపోయి చంద్రబాబును ఉద్దేశించి ఒక దిగజారుడు వ్యాఖ్య చేశారు నాని.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నడపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా కొడాలి నానికి చెందిన కళ్యాణమండపంలోనే జరిగిందని.. మూడు రోజుల పాటు ఇక్కడ వందల లావాదేవీలు జరిగాయని.. అందులో నానికి కూడా భారీగానే ముట్టిందని టీడీపీ నేతలు ఆరోపించడం తెలిసిందే. ఐతే నాని మాత్రం క్యాసినోతో తనకు సంబంధమే లేదంటున్నాడు. అసలలాంటిదేమీ గుడివాడలో జరగలేదంటున్నారు. ఈ విషయంలో తనది తప్పని నిరూపిస్తే పెట్రోలు పోసి తగలబెట్టుకుంటానని కూడా సవాలు చేశారు.
కాగా దీని గురించి ఒక టీవీ ఛానెల్ తాజాగా నానీని ప్రశ్నించగా.. ఆయన చంద్రబాబు మీద శివాలెత్తిపోయారు. మీ కళ్యాణమండపంలో క్యాసినో నడపలేదని మీరే రుజువు చేయొచ్చు కదా అంటే.. నేను ఇప్పుడు చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని అంటాను. అది నిజం కాదని చంద్రబాబు రుజువు చేస్తాడా అని ఎదురు ప్రశ్నించారు నాని. ఇదే మాటను మళ్లీ వల్లిస్తూ.. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఇంకెవడో అంటాడు. కాదని బాబు నిరూపిస్తాడా అంటూ మరో కామెంట్ కూడా చేశారు నాని. దీనికి తోడు చంద్రబాబునుద్దేశించి 420 గాడని, ఇంకోటని ఎప్పట్లాగే అందుకున్న తిట్లు మామూలే.
This post was last modified on January 22, 2022 10:23 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…