Political News

భారతిని ఇన్వాల్ చేసి జగన్ పై సెటైర్లు

స‌టైర్లు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకునే ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌పై త‌న స్ట‌యిల్లో స‌టైర్లు వేసి న‌వ్వించేశారు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్‌.. జిల్లాకో విమానాశ్ర‌యం క‌డ‌తామంటూ.. వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం జ‌రిగిన కేబినెట్‌లో దీనికి సంబంధించి నిర్ణ‌యం తీసుకున్న విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఈ కామెంట్ల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. జిల్లాకో.. వైద్యశాల అన్నారు..అదేమైంది.. ఇప్పుడు విమానాశ్ర‌యాలా? అంటూవారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనేమాజీ మంత్రి అయ్య‌న్న కూడా సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి స‌టైర్లు పేల్చారు. ‘‘అమ్మా.. భారతమ్మా.. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్‌లో గాని, విశాఖప్నటంలో గాని ఆసుపత్రి(పిచ్చాసుప‌త్రి)లో చూపించండమ్మా’’ అని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అయ్యన్నపాత్రుడు పూర్తిగా తప్పు బట్టారు.

జగన్ నిర్ణయంపై తాజాగా అయ్య‌న్న‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తుగ్గక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయని అయ్యన్న ప్రశ్నించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి వాటి నిర్మాణాలను గాలికొదిలేసి జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతావా? అంటూ ఎద్దేవా చేశారు.

ఉద్యోగులకు, పెన్షన్ దారులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని జగన్.. ఓటీఎస్ పేరుతో పేదల నుంచే డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. చెత్తమీద కూడా పన్ను వసూలు చేస్తూ.. జిల్లాకో ఎయిర్‌పోర్ట్ కడతామని చెప్పడానికి సిగ్గులేదా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. గ‌తంలో గుంటూరులో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఇదే అయ్య‌న్న జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో స‌టైర్లతోకుమ్మేయ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు సీఎంపై అదేరేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

This post was last modified on January 22, 2022 6:27 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

32 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

50 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

55 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago